బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి రెండు వారాలకే వెళ్ళిపోతుంది అనుకున్న ఇనాయ సుల్తానా ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారింది. సూర్య తో ఫ్రెండ్ షిప్ వలన రెండు వారాల టైమ్ వృధా చేసుకున్న ఇనాయ, సూర్య ఎలిమినేట్ అవ్వగానే మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. ఫైమా తో ఫ్రెండ్ షిప్ ఫైట్, ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ ఇనాయని టార్గెట్ చెయ్యడంతో ఆమెకి సింపతీ ఓటింగ్ పెరిగింది. గత రెండు వారాలుగా టైటిల్ ఫెవరెట్ రేవంత్ కి ఇనాయ గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పటికే సెకండ్ ప్లేస్ లో ఉన్న శ్రీహన్ ని తొక్కేసి.. ఆమె రెండో ప్లేస్ లోకి వచ్చి అందరికి షాకిచ్చింది. శ్రీహన్ మూడో స్థానానికి పడిపోయాడు. నామినేషన్స్ లో ఇనాయ సుల్తానా ప్రస్తుతం నెంబర్ 1 లో ఉండే రేవంత్ ని బీట్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ రోజు శుక్రవారం ఓటింగ్ ఎలా ఉంటుందో కానీ.. సోమవారం నుండి నిన్న గురువారం ఓటింగ్ ముగిసే సమయానికి.. మొదటి రెండు రోజులు రేవంత్ ఓటింగ్ పరంగా ఆధిక్యం కనబరిచినా.. నిన్న మాత్రం ఇనాయ సుల్తానా రేవంత్ ని బీట్ చేసి అందరికి షాకిచ్చింది. ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నా.. ఫస్ట్ ప్లేస్ లో కొనసాగే రేవంత్ మొదటిసారి ఇనాయ వలన సెకండ్ ప్లేస్ లోకి రావడం ఆయన ఫాన్స్ కే కాదు, బిగ్ బాస్ ఆడియన్స్ కి షాకిచ్చింది. మరి ఇనాయ నిజంగా ఇంతే పట్టు మీద ఉంటే.. టైటిల్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది అని, ఆమె ఇంత స్ట్రాంగ్ గా తయారవడానికి కొంతమంది కంటెస్టెంట్స్ అంటే శ్రీహన్, శ్రీ సత్య, ఫైమా లాంటి వాళ్ళే కారణమని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న టాక్.