Advertisementt

సింగర్ సునీత వారసుడ్ని దించుతోంది

Sat 12th Nov 2022 09:48 PM
singer sunitha,akash,sunitha son,akash birthday,akash turns hero  సింగర్ సునీత వారసుడ్ని దించుతోంది
Singer Sunitha Son Akash Turns Actor సింగర్ సునీత వారసుడ్ని దించుతోంది
Advertisement
Ads by CJ

సింగర్ సునీత వారసుడిని దించుతోంది అని అనగానే.. ఆమె మళ్లీ ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదు కానీ.. ఆమెకు ఆల్రెడీ ఒక కొడుకు, కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడా కొడుకుని.. వెండితెరకు పరిచయం చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన క్లారిటీని కూడా ఆమె ఇప్పటికే ఇచ్చేసింది. రీసెంట్‌గా తన కొడుకు ఆకాష్ పుట్టినరోజును పురస్కరించుకుని చేసిన పోస్ట్‌లో సింగర్ సునీత.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. త్వరలో నిన్ను నటుడిగా చూసేందుకు ఎంతగానో వేచి చూస్తున్నానంటూ తెలిపింది. అంతేకాదు, అతని లేటెస్ట్ ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో అందరూ సునీత తన వారసుడిని హీరోని చేయబోతోంది అంటూ.. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

సింగర్ సునీత విషయానికి వస్తే.. సింగర్‌గానే కాకుండా, టాప్ హీరోయిన్స్ ఎందరికో తన గొంతును అరువు ఇచ్చిన ఘనత ఆమెకి ఉంది. ఇప్పటికీ చరిత్రకు సంబంధించిన సినిమాలు వస్తే.. అందులో సునీత వాయిస్ లేకుండా ఉండదు. రీసెంట్‌గా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌కి కూడా ఆమె గొంతు అరువిచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్‌లతో కూడా ఎందరికో ఆమె స్ఫూర్తిగా నిలుస్తోంది. కష్టసమయంలో తనకు అండగా నిలబడిన తన కొడుకు, కుమార్తెల ఉన్నతిని కోరుకుంటూ.. వారిని సెటిల్ చేసి, వారికో మంచి లైఫ్‌ని సెట్ చేసే పనిలో సునీత ఉన్నట్లుగా తెలుస్తోంది. 

Singer Sunitha Son Akash Turns Actor:

Singer Sunitha Clarity about Her Son Acting Debut

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ