బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన విన్నర్ అయినా, రన్నర్ అయినా, లేదంటే ప్రతి వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసిన కంటెస్టెంట్స్ అయినా ఎవరైనా సరే.. బిగ్ బాస్ నుండి కాలు బయటపెట్టగానే ఛానల్స్ వాళ్ళు వాళ్ళ ముందు వాలిపోయి.. బిగ్ బాస్ కబుర్లు, ఎవరు హౌస్ లో బావుంటారు, ఎవరు కన్నింగ్, ఎవరు మంచి వాళ్ళు, నువ్వెందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, నిన్నెవరు ఆడకుండా చేసారు అంటూ నానారకాల ప్రశ్నలతో వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్స్ రాబట్టేసి.. వీళ్ళు ఇంటర్వూస్ తో డబ్బు సంపాదించేస్తారు.
కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ అందరికి గలాటా గీతూ షాకిచ్చింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక మూడు రోజులు తిండి, నిద్ర మాత్రమే కాదు కనీసం స్నానం కూడా చెయ్యకుండా ఏడుస్తూనే ఉంది.. చివరికి అజ్ఞాతం నుండి బయటికి వచ్చి తన యూట్యూబ్ ఛానల్ లోనే ఓ వీడియో ని పోస్ట్ చేసింది. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటికి రావడం మాములు విషయం కాదు, గీతు వాళ్ళ చాలా విషయాలే బయటికి వస్తాయని యూట్యూబ్ ఛానల్స్ ఆమె కోసం కాపు కాచాయి. కానీ గీతూ బయటికి రాకుండా సీక్రెట్ ని మెయింటింగ్ చేస్తూ వాళ్ళకి షాకిచ్చి వీడియో వదిలింది.. ఆమె ఎప్పుడు అజ్ఞాతం వీడి బయటికి వస్తుందా అని ప్రముఖ ఛానల్స్ తో పాటుగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎదురు చూస్తూ.. గీతూ పాత వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నాయి.
మరి గీతూ ఇంత బాధపడుతుండడంతో ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ ఆమెని హైదరాబాద్ నుండి చిత్తూర్ తీసుకెళ్లిపోయారనే టాక్ కూడా. ఆమె ఎప్పుడు హైదరాబాద్ వస్తుందా అని ఛానల్స్ అన్ని వెయిటింగ్.