Advertisementt

రష్మిక బాధపడటానికి కారణమిదేనా?

Sat 12th Nov 2022 12:49 PM
rashmika mandanna,kannada cine industry,hate message,rashmika emotional,heroine  రష్మిక బాధపడటానికి కారణమిదేనా?
This is the Reason for Rashmika Mandanna Emotional Message రష్మిక బాధపడటానికి కారణమిదేనా?
Advertisement
Ads by CJ

హీరోయిన్ రష్మిక మందన్నా రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా.. నా గుండె బద్దలైపోతుంది అంటూ ఓ మెసేజ్‌ని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తను ఒకటి మాట్లాడితే.. అక్కడ ఇంకోలా ప్రొజెక్ట్ అవుతుందని, అలాంటి హేట్ మెసేజెస్ తనని బాగా ఇబ్బందికి గురిచేస్తున్నాయంటూ.. రష్మిక తన పోస్ట్‌లో తెలిపింది. ఎందుకు ప్రతీది నెగిటివ్‌గా చూస్తున్నారో అర్థం కావడం లేదని, అందర్నీ ఎంటర్‌టైన్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నా.. ఆ కష్టం చూడకుండా.. ఏవేవో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ బాధపడిన రష్మిక.. దయచేసి అవన్నీ మానుకుని.. ఎదుటివారిపై ప్రేమతో మెలగడం నేర్చుకోమని హితబోధ చేసింది. అయితే రష్మికపై ట్రోలింగ్‌కి, హేట్ మెసేజెస్‌‌కి కారణం ఎవరో కాదు.. ఆమె స్వయంకృతాపరాధమే. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆమె.. ఆ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తుండటమే.. ఇప్పుడామె ఇలాంటి పోస్ట్‌లు పెట్టుకోవడానికి కారణంగా తెలుస్తోంది. 

 

తన సొంత ఇండస్ట్రీ ప్రేక్షకులే ఆమెను హేట్ చేస్తుండటంతో.. తట్టుకోలేకే రష్మిక అలా బాధపడుతూ పోస్ట్ చేసిందని తెలుస్తోంది. అదెలా అంటే.. రీసెంట్‌గా వచ్చిన ‘కాంతార’ సినిమా అన్ని చోట్ల పెద్ద విజయం సాధించింది. ప్రభాస్, అనుష్క వంటివారు కూడా ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మాత్రం.. ఓ సందర్భంలో ఆ సినిమానే చూడలేదు అని తెలిపింది. అలాగే రీసెంట్‌గా జరిగిన కన్నడ రాజ్యోత్సోవం రోజు కూడా ఆమె శుభాకాంక్షలు తెలపలేదు. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ‘కిరీక్ పార్టీ’ టీమ్ చేసిన ‘చార్లి’ సినిమా విడుదల సమయంలో కూడా కామ్‌గా ఉంది తప్ప స్పందించలేదు. అందుకే కన్నడ ప్రేక్షకులు ఆమెపై కక్ష కట్టారు. ‘నువ్వు కన్నడ ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం లేదు’ అంటూ వారు చేస్తున్న కామెంట్స్‌కే రష్మిక బాధపడుతూ అలా పోస్ట్ చేసిందనేలా వార్తలు వినిపిస్తున్నాయి.

This is the Reason for Rashmika Mandanna Emotional Message:

Kannada Audience Serious on Rashmika Mandanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ