ఈమధ్యన మీడియాలో విడాకుల మేటర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సామాన్యులు విడాకులు తీసుకుంటే పెద్ద మేటర్ కాదు కానీ సెలబ్రిటీస్ మాత్రం విడాకులు తీసుకుంటున్నారని తెలిసినా.. తీసుకున్నారని తెలిసినా మీడియా లో అదో పెద్ద సంచలనమే. రీసెంట్ గా సానియా మీర్జా-షోయెబ్ ల విడాకుల మ్యాటర్ హాట్ హాట్ గా వినిపిస్తున్న టైమ్ లోనే.. ఇప్పుడో నటి తన భర్త తో సపరేట్ గా ఉంటుంది అనే న్యూస్ చూసిన ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో షాకవుతున్నారు. కోలీవుడ్ స్వీట్ కపుల్ మధ్యన జరిగే గొడవల మేటర్ పెద్ద షాకింగ్ విషయం. ఆ జంట ఎవరో కాదు. కోలీవుడ్ క్యూట్ కపుల్ స్నేహ మరియు ప్రసన్న. హీరోయిన్ గా నటిస్తూ.. తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యి ఇప్పటికీ ఆడియన్స్ దగ్గరగానే ఉంటున్న నటి స్నేహ తన భర్త ప్రసన్నతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి దూరంగా ఉంటుంది అనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.
కోలీవుడ్ నటుడు ప్రసన్నని వివాహం చేసుకున్న స్నేహ.. తర్వాత కూడా భర్త ప్రసన్న ఇద్దరూ సినిమాల్లో నటించారు. కలిసి యాడ్స్ షూట్ కూడా చేసారు.. వాళ్ళకి ఓ బాబు, ఓ పాప కూడా ఉంది. ఎంతో క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీగా ఉంటున్న ప్రసన్న కి స్నేహకి మధ్యన వచ్చిన మనస్పర్థల కారణంగా స్నేహ భర్త పై కోపంతో పిల్లలతో కలిసి వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యింది అని, ఈమధ్యన స్నేహ తరచూ హైదరాబాద్ వచ్చి వెళుతుంది. ఆమె తెలుగులో బుల్లితెర షోస్ లో కనిపిస్తుంది కాబట్టి స్నేహ హైదరాబాద్ కి వస్తుంది. ప్రసన్న-స్నేహ లు ఇరువురు విడాకులు కూడా కోరుకుంటున్నారని చెబుతున్నా.. ఈ విషయంపై ఈ జంట ఇంకా స్పందించలేదు.