Advertisementt

ఏడుస్తూనే అజ్ఞాతం వీడిన బిగ్ బాస్ గీతూ

Thu 10th Nov 2022 05:07 PM
bigg boss,galata geetu royal,galata geetu royal first video  ఏడుస్తూనే అజ్ఞాతం వీడిన బిగ్ బాస్ గీతూ
Galata Geetu Royal First Video ఏడుస్తూనే అజ్ఞాతం వీడిన బిగ్ బాస్ గీతూ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 6 నుండి తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యి ఏడ్చుకుంటూ బయటికి వచ్చి ఎవరిని కలవకుండా సీక్రెట్ గా ఉన్న గలాటా గీతూ.. ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వకుండా కామ్ గా ఉంది. దానితో ఆమె మళ్ళీ బిగ్ బాస్ కి రీ ఎంట్రీ ఇస్తుందేమో.. లేదంటే ఇంత సీక్రెట్ గా అయితే ఉండదు. ఇంటర్వూస్ ఇస్తూ హడావిడి చేస్తుంది. అసలు ఆ ఎలిమినేషన్ బాధ తట్టుకోలేక బయట ముఖం చూపించకుండా ఉండిపోయిందా.. నిజంగానే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వరకు బయటికి రాదేమో అంటూ చాలా ఊహించేసుకున్నారు. కానీ గీతూ రాయల్ బిగ్ బాస్ కి ఎలాంటి రీ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఎందుకంటే గీతూ రాయల్ బిగ్ బాస్ నుండి వచ్చాక తన పర్సనల్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను ఎందుకని బిగ్ బాస్ నుండి బయటికి వచ్చానో అనేది ఆ వీడియోలో చెప్పింది. అది కూడా ఏడుస్తూనే మాట్లాడింది. 

ఆ వీడియో లో గీతూ తాను బిగ్ బాస్ లో రాజ్, మరీనాలు ఈ గేమ్ కి పనికిరారు అన్నాను, బాలాదిత్య ని నాట్ యువర్ కప్ అఫ్ టీ అన్నాను. కానీ వాళ్ళు కాదు.. నేను ఆడలేదు అందుకే బయటికి వచ్చేసాను అంటూ ఏడ్చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ కి వెళ్లేముందు నాకు చాలామంది సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్స్ ఎవరూ నాకు సపోర్ట్ చెయ్యలేదు మోసం చేసారు. నా ఫ్యామిలీ, ఇంకొద్దిమంది స్నేహితులు తప్ప నన్ను అందరూ మోసం చేసారు. నేను వెళ్ళాక ఎమన్నా వీడియోస్ చేస్తూ సపోర్ట్ చేస్తారు అనుకున్నా, అసలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక నాకు సపోర్ట్ లేదు. ఇక నేను ఎలాంటి పీఆర్ టీం పెట్టుకోలేదు. ఎందుకంటే నేను బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ వాళ్ళు పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చేసారు అంటూ రాసిన నేను.. ఆలా చేస్తే బాగోదని.. ఎలాంటి పిఆర్ టీమ్ ని పెట్టుకోలేదు.. బిగ్ బాస్ మీద ఒట్టేసి చెబుతున్నా అంటూ గీతూ ఆ వీడియో లో చెప్పింది.

Galata Geetu Royal First Video:

Bigg Boss Galata Geetu Royal First Video viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ