సొంతం, జెమిని లాంటి చిత్రాల్లో ఎంతో అమాయకంగా, క్యూట్ గా అందరిని మెస్మరైజ్ చేసిన నమిత.. తర్వాత బొద్దుగా బరువుగా తయారయ్యింది. అయినప్పటికీ తమిళ తంబీలనుండి ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకుని వాళ్లతో గుడి కట్టించుకుంది. తర్వాత నమిత బరువు బాగా పెరిగిపోవడంతో ఆమెకి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అలా సినీ అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె తమిళంలో బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఇకపై నమిత నటనకు గుడ్ బై చెప్పేస్తుంది అనుకున్నారు. కానీ పెళ్లి తర్వాత కూడా నమిత నటనకు దగ్గరగానే ఉంది. ఇక ఈ మధ్యనే కవల పిల్లలకి జన్మనిచ్చిన నమిత శ్రీవారి దర్శనానికి భర్తతో కలిసి తిరుమలకి వచ్చి వెళ్ళింది.
అటు రాజకీయాలవైపు అడుగులు వేస్తున్న నమిత తాజాగా బుల్లితెర కి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ లో డాన్స్ చేసి దుమ్మురేపింది. జీ తెలుగు తనకి చాలా క్లోజ్ ఫ్యామిలీలా ఉంది అంటూ ఎమోషనల్ అయిన నమితకు డాన్స్ ఇండియా డాన్స్ యాంకర్స్ సాదరంగా ఆహ్వానం పలికారు. మరి నమిత మాత్రమే కాదు.. కామ్నా జెఠ్మలానీ కూడా ఈ షోతో బుల్లితెర మీదకి రీ ఎంట్రీ ఇచ్చింది. నమిత తో పాటుగా కామ్నా డాన్స్ ఈ షోకి హైలెట్ గా నిలిచింది.