యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. NTR30 నుండి వస్తున్న చిన్న చిన్న అప్ డేట్స్ కే వారు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అనిరుద్ NTR30 మ్యూజిక్ సిట్టింగ్ లో ఈ నెల చివరి వారం నుండి కూర్చోబోతున్నాడని తెలిసి పండగ చేసుకున్నారు. ఇక రీసెంట్ గా కొరటాల శివ తన టీం సాబు సిరిల్, DOP రత్నవేలుతో మీటింగ్ పెట్టి NTR30 ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ అంటూ మేకర్స్ అప్ డేట్ ఇవ్వడంతో ఫాన్స్ అస్సలాగడం లేదు. ఎన్టీఆర్ ని సెట్స్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఉన్నారు.
తాజాగా NTR30 టీం షూటింగ్ కోసం లొకేషన్స్ వేటలో ఉందట. ఇప్పటికే గోవా తదితర ప్రాంతాలు తిరిగి కొన్ని రేర్ లొకేషన్స్ ని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలు పెట్టి.. వచ్చే ఏడాది దసరాకి సినిమాని రెడీ చేసేసే ఆలోచనలో కొరటాల ఉన్నారని అంటున్నారు. ఎన్టీఆర్ కూడా ఒక్కసారి సెట్స్ మీదకి వెళ్ళాక ఎలాంటి గ్యాప్ కానీ, బ్రేక్ కానీ ఇవ్వకుండా NTR30 షూటింగ్ పూర్తి చెయ్యాలని చూస్తున్నారట. ఇక ఫైనల్ గా ఇంకో వారంలో ఎన్టీఆర్ తో కలిసి నటించబోయే హీరోయిన్ విషయంలోనూ ఓ క్లారిటీ వస్తుంది అని తెలుస్తుంది.