ఇప్పటికే కుర్ర హీరో విశ్వక్ సేన్ తన సినిమాల్ని తానే నిర్మించుకుంటున్నాడు. మధ్యలో ఇతర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్నా.. కొన్నిసార్లు అతని సినిమాలకి అతనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా, నిర్మాతగా దమ్కీ మూవీ తెరకెక్కుతుంది. అయితే విశ్వక్ సేన్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామందికి యాంటీ గా మారాడు. ఈమధ్యన విశ్వక్ సేన్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే విశ్వక్ సేన్ అర్జున్ ని ఇబ్బంది పెట్టి అతని సినిమా నుండి బయటికి వచ్చెయ్యడమే. అది విశ్వక్ దృష్టిలో ఒప్పే కావచ్చు.. కానీ నిర్మాతల దృష్టిలో అది తప్పే. నిర్మాత అనేవాడు ప్రాణం పెట్టి సినిమాని నిర్మించడానికి కష్టపడతాడు. కానీ కొంతమంది హీరోలు ఈగోలకి పోయి తప్పు చేస్తారు.
అయితే ఇక్కడ విశ్వక్ సేన్-అర్జున్ ఇష్యూలో తప్పు విశ్వక్ సేన్ దే అంటున్నారు ప్రముఖులు. ఇండస్ట్రీలో చాలామంది(తమ్మారెడ్డి, జి నాగేశ్వర్ రెడ్డి) లాంటి వాళ్ళు విశ్వక్ సేన్ నే తప్పుపడుతున్నారు.. ఇలా హీరోలు కథలు, డైరెక్షన్ లో చేతులు పెట్టి తలనొప్పులు తెస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల మధ్యన ఇకపై విశ్వక్ సేన్ తో సినిమా చేసే ధైర్యం, సాహసం ఏ నిర్మాత చెయ్యరేమో.. ఒకవేళ విశ్వక్ సేన్ తో ఎవరూ సినిమాలు చెయ్యకపోతే, ఇకపై తన సినిమాలని తానే నిర్మించుకోవాలేమో అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి విశ్వక్ సేన్ నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి.