సమంత ప్రస్తుతం హెల్త్ ఇష్యూతో సతమతమవుతోంది. ఆమె ఎలాంటి స్థితిలో ఉందో.. హెల్త్ విషయంలో ఎంత ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తుందో అనేది యశోద ఇంటర్వ్యూలో చెప్పి అందరి చేత కంటతడి పెట్టించింది. మాయోసైటిస్ తో సమంత ఎంతగా వేదన అనుభవించిందో అనేది అందరికి కళ్ళకి కట్టినట్టుగా అర్ధమైంది. అయితే ఇప్పుడు సమంత పార్ట్నర్ అదేనండి ఆమె నటించబోయే బాలీవుడ్ ప్రాజెక్ట్ హీరో వరుణ్ ధావన్ కూడా తన హెల్త్ ఇష్యూని బయట పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. వరుణ్ ధావన్-సమంత లు ఇద్దరూ రాజ్ అండ్ DK దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చెయ్యాల్సి ఉంది. దాని కోసం సమంత మరియు వరుణ్ ధావన్ లు ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారని కూడా అన్నారు.
అయితే వరుణ్ ధావన్ తాజాగా మీడియా తో మట్లాడుతూ తనకి ఈమధ్యన ఉన్నట్టుండి బ్యాలెన్స్ కోల్పోవడం, అలాగే కళ్ళు తిరగడం జరుగుతున్నాయి.. ఏమైందో ఏమో అని చాలా కంగారు పడ్డాను. అయితే నేను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ తో బాధపడుతున్నట్లుగా తర్వాత తెలిసింది. దానినుండి కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాను అంటూ వరుణ్ ధావన్ ఆ మీడియా మీట్ లో చెప్పడం చూసి ఆయన ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ వ్యాధి లక్షణాలు తరుచూ కళ్ళు తిరగడం, వికారంగా ఉండి వాంతులు అవడం, ఆందోళన, కంగారు అనిపించడం లాంటివి ఉంటాయట.
అయితే వరుణ్ ధావన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ నుండి కోలుకోవడానికి యోగ, అలాగే డాక్టర్ ట్రీట్మెంట్ ఇంకా స్విమ్మింగ్, లైఫ్ స్టయిల్లో మార్పులు చేసుకుని.. ఈ సమస్య నుండి బయటపడుతున్నట్టుగా వరుణ్ ధావన్ చెప్పడంతో అభిమానులు ఊపి పీల్చుకుంటున్నారు. కాకపోతే సమంత లాగే ఆమె పార్ట్నర్ వరుణ్ ధావన్ ఒకేసారి ఇలా హెల్త్ ఇష్యూస్ తో సతమతమవడం నిజంగా కో ఇన్సిడెన్స్ అనే చెప్పాలి.