అసలే SSMB28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి బోలెడంత టైం తీసుకున్నారు మహేష్ అండ్ త్రివిక్రమ్ లు. ఎట్టకేలకు సెప్టెంబర్ లో సినిమాని సెట్స్ మీదకి తీసుకుని వస్తే.. మహేష్ బాబు ఇంట విషాదం, తర్వాత లండన్ ట్రిప్ తో సమయం గడిచిపోయింది. ఇక నవంబర్ రెండో వారం, లేదా మూడో వారం నుండి SSMB28 కొత్త షెడ్యూల్ మొదలుపెడదామంటే ఇప్పుడు హీరోయిన్ సమస్య. హీరోయిన్ గా మహేష్ సరసన పూజ హెగ్డే రెండోసారి జత కడుతుంది, దర్శకుడు త్రివిక్రమ్ కి హీరోయిన్స్ ని రిపీట్ చెయ్యడం అలవాటు. ఇప్పడూ అదే చేస్తున్నారు గురూజీ.
అయితే ఇప్పుడు SSMB28 సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా పూజ హెగ్డే ఉండాలట. ఎందుకంటే పూజ హెగ్డే పై మహేష్ బాబు పై కొన్ని ప్రత్యేక సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్ లోనే చెయ్యాల్సి ఉందట. పూజ హెగ్డే టీం కి అందుబాటులో లేదు. అయితే ఆమె ఇతర సినిమా షూటింగ్స్ తో బిజీగా లేదు. కానీ కాలు బెణికి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూ బెడ్ రెస్ట్ లో ఉంది. పూజ హెగ్డే రెండో షెడ్యూల్ కి జాయిన్ అవ్వాలంటే ఆమె మళ్ళీ కాలుకి స్కాన్ చేయించి ఏం పర్లేదు అని డాక్టర్స్ చెబితే ఆమె షూటింగ్ లో జాయిన్ అవుతుంది.. లేదంటే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మరోసారి ఈ షెడ్యూల్ వాయిదా పడొచ్చని అంటున్నారు.