బిగ్ బాస్ సీజన్ 6 లో పదోవారం కెప్టెన్సీ టాస్క్ మాములుగా జరగడం లేదు. కంటెస్టెంట్స్ అంతా రెచ్చిపోయి ఫిజికల్ గా కలబడుతున్నారు. ఫైమా-ఇనాయలైతే మరీ ఫిజికల్ గా ఒకరినొకరు చుట్టుకుని మరీ కొట్టుకున్నారు. గత రాత్రి ఎపిసోడ్ మొత్తం కొట్టుకుంటూనే ఉన్నారు. ఇనాయని ఫైమా డిశ్ క్వాలిఫై చేయడంపై ఇనాయ సీరియస్ అయ్యింది. ఇక ఈరోజు కూడా ఈ టాస్క్ కంటిన్యూ అయ్యింది. నాగమణిని కాపాడుకోమని చెప్పగానే రెండు టీం ల సభ్యులు ఆ మణి ని కాపాడడం కోసం నానా తంటాలు కాదు.. ఫిజికల్ గా గొడవపడ్డారు. రేవంత్ కి ఆది రెడ్డికి మధ్యన పెద్ద ఫైట్ అయ్యింది.
రేవంత్ ఫిజికల్ గా కొడుతున్నాడంటూ ఫైమా, ఇంకా కీర్తి లాంటి వాళ్ళు చెప్పగా.. అది రెడ్డి వచ్చి రేవంత్ తో గొడవేసుకున్నాడు. నాకు గోరు తగిలినా నేనూ ఊరుకోను, కలబడి కొడతా, తోలు తీస్తా అన్నాడు రేవంత్. నేను ఫిజికల్ గా గేమ్ ఆడను, నీట్ గా ఆడతాను, నేనూ కూడా తగ్గను అంటూ రేవంత్ పై ఆది రెడ్డి రెచ్చిపోయాడు. ఇక తమ టీం లోనే ఉన్న శ్రీ సత్యని కాపాడకుండా రేవంత్ కూర్చోవడంపై శ్రీ సత్య సీరియస్ అయ్యింది. ఆట ఆడడం రానివాళ్లు కూడా మాట్లాడుతున్నారు. ఫిజికల్ అంటూ ఎత్తి చూపుతున్నారని రేవంత్ అనగానే ఫైమా కూడా రేవంత్ తో వాదిస్తూనే ఉన్న ప్రోమో ఈ రోజు ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ని రేకెత్తించింది.