అర్జున్ తన కూతురిని గ్రాండ్ గా హీరోయిన్ గా పరిచయం చేద్దామని ఏరికోరి విశ్వక్ సేన్ ని హీరోగా ఎంచుకుని దర్శకనిర్మాతగా రంగంలోకి దిగిన అర్జున్ కి విశ్వక్ సేన్ చాలా తొందరలోనే బిగ్ షాక్ ఇచ్చాడు. అషూటింగ్ మొదలు పెట్టాక చెప్పా చెయ్యకుండా మానెయ్యడం పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అటు అర్జున్ విశ్వక్ పై చర్యలు తీసుకోమంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ని కలిసినట్టుగా వార్తలొస్తున్నాయి. విశ్వక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అర్జున్ కూడా ఆ సినిమాని పక్కనపెడతారేమో అనుకున్నారు. కానీ విశ్వక్ సేన్ ప్లేస్ లోకి మరో హీరోని తెచ్చే ప్రయత్నాల్లో అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
విశ్వక్ సేన్ కోసం రాసిన కేరెక్టర్ లో చిన్న చిన్న మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ పాత్రకి హీరో శర్వానంద్ అయితే సరిపోతుంది అని, శర్వానంద్ అయితే ఐశ్వర్య అర్జున్ సరసన హీరోగా బావుంటాడని అర్జున్ ఆలోచించడమే కాదు, శర్వానంద్ ని కలిసేందుకు ఏర్పట్లు చేసుకుంటున్నారంటున్నారు. శర్వానంద్ కూల్ గా సినిమాలు చేసుకుంటాడు. అందుకే అర్జున్ విశ్వక్ సేన్ ప్లేస్ లోకి శర్వానంద్ ని తీసుకొచ్చి త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది.