అనసూయ జబర్దస్త్ వదిలేసి నెలలు గడిచిపోతున్నాయి. ఇంకా అనసూయ జబర్దస్త్ వదిలేసిన మేటర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అలాగే కామెడీ ప్రియులు వదలడం లేదు. ఇక మల్లెమాల యాజమాన్యం కూడా రష్మీ నే రెండు వారాలకు యాంకర్ గా వాడేస్తున్నారు. కానీ ఈ వారం రష్మీ ప్లేస్ లో కొత్త యాంకర్ సీరియల్ నటి సౌమ్య రాబోతుంది. ఈ గురువారం సౌమ్య జబర్దస్త్ కి యాంకర్ గా ఎంట్రీ అవ్వబోతుంది. అదలా ఉంటే.. అనసూయ జబర్దస్త్ మానెయ్యడానికి కారణం అనసూయ చెప్పింది.. తనకి సినిమా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి జబర్దస్త్ కి రావడం కుదరడం లేదు అని.
ఇక అనసూయ కి వెండితెర ఆఫర్స్ ఎక్కువయ్యాయి అందుకే జబర్దస్త్ మానేసిందట కదండీ అని ఓ యాంకర్ రష్మిని అడిగితే అవునండి నేనూ విన్నాను అంటుంది. అనసూయ కి సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలనే జబర్దస్త్ కి రాలేకపోతుంది అని అనుకోవడం నేను విన్నాను అంటూ రష్మీ తన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు నేను అనసూయ మట్లాడుకుని అనసూయ జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతే నేను ఆమె ప్లేస్ తీసుకోలేదు. మల్లెమాల వాళ్ళు రమ్మన్నారు.. నేను వెళ్ళాను. నా మాదిరిగానే సౌమ్య కూడా వచ్చి ఉంటుంది.. వాళ్ళు అడిగారని వచ్చి ఉంటుంది.. ఆమె పర్మినెంట్ అని నేనూ చెప్పను అంటూ కొత్త యాంకర్ పై రష్మీ కామెంట్స్ చేసింది.