Advertisementt

నా విషయం తెలిసి అమ్మ ఏడ్చేసింది: అను

Wed 09th Nov 2022 12:19 PM
anu emmanuel,allu sirish  నా విషయం తెలిసి అమ్మ ఏడ్చేసింది: అను
Anu Emmanuel interesting on Allu Sirish నా విషయం తెలిసి అమ్మ ఏడ్చేసింది: అను
Advertisement
Ads by CJ

ఒక హీరో-హీరోయిన్ తాము నటించిన సినిమాలో రొమాంటిక్ గా కనిపించినా, క్లోజ్ గా మూవీ అయినా.. ఆ హీరో-హీరోయిన్ మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ రూమర్స్ పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు ఇదే రూమర్ అను ఇమ్మాన్యువల్-అల్లు శిరీష్ కి మధ్యలో నడుస్తుంది. అసలు సినిమా విడుదలకు ముందే అను కి శిరీష్ కి మధ్యన ఏదో ఉంది అనే న్యూస్ గుప్పుమంది. ఆఖరికి అల్లు అరవింద్ గారు కూడా మా అబ్బాయిని లవ్ చేసావా అంటూ అనుని ఆటపట్టించారు. అయితే వారు నటించిన ఉర్వశివో రాక్షసివో హిట్ అవడంతో.. అను ఇమ్మాన్యువల్ కూడా శిరీష్ తో లవ్ ఎఫ్ఫైర్ పై స్పందించింది. 

తాను అల్లు శిరీష్ తో కలిసి నటించడంతో.. మా మధ్యన ఎఫ్ఫైర్ ఉంది అని ప్రచారం జరుగుతుంది. నేనైతే ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నాను. కానీ మా అమ్మ ఈ వార్తలు చూసి ఏడ్చేసింది. ఇలాంటి రూమర్స్ వల్ల అమ్మాయిల భవిష్యత్తు ఏమైపోతుందో అనేది అమ్మ భయం. అలా అమ్మ వేదనని చూసి నాకు చాలా బాధేసింది. అసలు ఉర్వశివో రాక్షసివో సినిమాకి ముందు అల్లు శిరీష్ ని చూసింది, కలిసింది లేదు. సినిమా మొదలు పెట్టిన రోజే శిరీష్ ని కలిసాను. అనుకోకుండా సినిమా రంగంలోకి వచ్చాను. కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి కాఫీ తాగిన తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి కథలు అల్లెయ్యడం అస్సలు బాగోలేదు అంటూ అను చెప్పుకొచ్చింది. 

Anu Emmanuel interesting on Allu Sirish:

Anu Emmanuel responds to link-up rumors with Sirish

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ