ప్రభాస్ ఫాన్స్ సాహో, రాధేశ్యామ్ లాంటి డిసాస్టర్ చూసాక ఇప్పుడు ఆయన నుండి రాబోయే పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా పెట్టుకుంటే.. ఆదిపురుష్ వాళ్ళ అంచనాలని తల్లకిందులు చేసింది. ఎంతగా టీజర్ ని 3D లో చూసినా ఫాన్స్ లో ఆందోనళ తొలగడం లేదు. ఇప్పుడు హై టెక్నాలజీ, అలాగే అద్భుత విజువల్స్ కోసం సినిమాని జనవరి 12 నుండి జూన్ 16 కి పోస్ట్ పోన్ చేస్తూ ప్రకటన ఇచ్చారు. అయినా ప్రభాస్ ఫాన్స్ పెద్దగా ఫీలవలేదు. ఇక ఆదిపురుష్ వచ్చిన మూడు నెలలకే సలార్ వచ్చేస్తుంది.. అదొక యాక్షన్ ఫిలిం కాబట్టి హిట్ పక్కా అని ఫీలవుతున్నారు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా బజ్ ప్రకారం ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా సెప్టెంబర్ 28 నుండి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఆదిపురుష్ టాక్ అటు ఇటు అయితే.. ఆ ప్రభావం సలార్ మీద పడుతుంది. అలాగే ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ వచ్చిన కేవలం మూడు నెలలకే మరో పాన్ ఇండియా ఫిలిం అంటే అంత క్రేజ్ రాదేమో.. కలెక్షన్స్ పై కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ తప్పదని సలార్ మేకర్స్ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అందుకే సలార్ ని డిసెంబర్ కానీ, లేదంటే 2024 కి షిఫ్ట్ చేసినా పెద్దగా షాకవ్వాల్సిన పని లేదు అంటున్నారు.
మూడు నెలల గ్యాప్ లో రెండు పాన్ ఇండియా ఫిలిమ్స్ తో సందడి చేద్దామని కలలు గన్న ప్రభాస్ ఫాన్స్ ఈ న్యూస్ చూడగానే డిస్పాయింట్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు.