Advertisementt

బిగ్ బాస్ 6: ఫైమా vs ఇనాయ

Tue 08th Nov 2022 07:52 PM
bigg boss 6,inaya,faima  బిగ్ బాస్ 6: ఫైమా vs ఇనాయ
Bigg Boss 6: Faima vs Inaya బిగ్ బాస్ 6: ఫైమా vs ఇనాయ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో మిత్రులు శత్రువులవుతున్నారు, శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. హౌస్ లో మొదటి నుండి స్నేహితులుగా మెలుగుతున్న ఫైమా-ఇనాయలు గత రెండు వారాలుగా బద్ద శత్రువులుగా మారిపోయి కొట్టేసుకుంటున్నారు. ఫైమా ని వెన్నుపోటు పొడిచింది అంటూ ఇనాయ ని శ్రీ సత్య-శ్రీహన్ లు వెటకారంగా కూడా చేసారు. గత వారమే ఇనాయ-ఫైమాలు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక ఈ వారమైతే ఫైమా ఇనాయని నామినేట్ చెయ్యలేదు కానీ.. ఇనాయ మాత్రం పగబట్టిన పాములాగా ఫైమని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసింది. నువ్ నా ఫ్రెండ్ వి కాదు అంటే నువ్ నా ఫ్రెండ్ వి కాదు అంటూ గొడవపడ్డారు. ఫైమా అయితే ఇనాయని మాట్లాడనివ్వకుండా డిఫెండ్ చేసుకుంది. అంతలా నామినేషన్స్ లో గొడవ జరిగింది.

ఇక పదో వారం కెప్టెన్సీ టాస్క్ లో ఇనాయ కి ఫైమా కి మధ్యన బిగ్ ఫైట్ జరిగింది. ఇనాయ-ఫైమా ఫిజికల్ గా హోరా హోరిగా కలబడ్డారు. ఇనాయ ఫైమా షర్ట్ పట్టుకుని ఈడ్చుకుంటూ పోయింది. ఒకరినొకరు కలియబడిన ప్రోమో చూస్తే అమ్మో వీరిద్దరూ ఏంట్రా బాబు అనుకుంటే.. అది రెడ్డి మాత్రం ఇద్దరూ ఓవర్ చేస్తున్నారు అంటున్నాడు. చివరికి ఎవరి నిచ్చన ఎలా ఉందో ఫైమా డిసైడ్ చేసి ఒకరిని తొలగించమని బిగ్ బాస్ చెప్పగానే.. రాజ్, శ్రీ సత్యాలు బిగ్ బాస్ అంటూ అరిచారు. ఇక ఫైమా నిచ్చెనలు పరిశీలిస్తూ ఇనాయని ఈ గేమ్ లో డిశ్ క్వాలిఫై చెయ్యగానే ఇనాయ అరుచుకుంటూ.. ఫైమాని వరెస్ట్ గేమర్ ఇన్ ద హౌస్ అంటూ పిచ్చ కోపంతో వెళ్ళిపోయింది. 

Bigg Boss 6: Faima vs Inaya:

Bigg Boss 6: Today episode promos viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ