యంగ్ హీరో విశ్వక్ సేన్ ఏది చేసినా సెన్సేషన్ అవుతుంది అనుకుంటాడేమో.. కానీ ఒక్కోసారి అది మిస్ ఫైర్ కూడా అవుతుంది. రీసెంట్ గా అర్జున్ దర్శకత్వం నుండి బయటికి వచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. అర్జున్ తో విశ్వక్ సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న క్రమంలో విశ్వక్ ఇలాంటి పనులు చేస్తే అతని కెరీర్ కే ప్రమాదమే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అటు అర్జున్ కూడా మా అధ్యక్షుడు విష్ణుకి విశ్వక్ పై చర్యల కోసం కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. తనకి నచ్చని పని చెయ్యలేను, ఇష్టం లేకుండా ఓ ప్రాజెక్ట్ లో కొనసాగ లేకే బయటికి వచ్చినట్టుగా విశ్వక్ చెప్పిన తీరుకి చాలామంది షాక్ అవుతున్నారు.
తాజాగా ఈ విషయమై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో నే ఆయన ఏ దర్శకుడి దర్శకత్వంలో నటించినా దర్శకుడు చెప్పేది వినేవారు. దర్శకత్వం విషయంలో ఎలాంటి జోక్యం చేసుకునేవారు కాదు. అదే నిబద్దత బాలయ్య లోను చూసాను. కాల్షీట్ ప్రకారం సెట్స్ లో ఉండేవారు. కానీ ఇక్కడ విశ్వక్-అర్జున్ గొడవలో అర్జున్ సినిమా మొదలు పెట్టేసి షూటింగ్ చేసేసారు. కానీ విశ్వక్ మాత్రం నాకు నచ్చని విషయాలు పరిష్కరించుకుని సినిమాలు పెడదామని చెబుతున్నాడు. అర్జున్ కి దర్శకుడిగా అనుభవం ఉంది, ఆయన నచ్చలేదు అనుకుంటే విశ్వక్ సేన్ ముందే మానెయ్యల్సింది. కాని మధ్యలో ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు, కొత్తగా వచ్చే హీరోలంతా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. కథలో కాళ్ళు వేళ్ళు పెడుతున్నారు. అందుకే సినిమాలు ఎక్కువగా ప్లాప్ అవుతున్నాయి. అంతేకాదు ఈవెంట్స్ లోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ పద్దతి మార్చుకోవాలి అంటూ తమ్మారెడ్డి విశ్వక్ తీరుపై ధ్వజమెత్తారు.