సినీ నటుడు అలీ సినిమాల్లో కామెడీ పాత్రలు వెయ్యడమే కాదు, ప్రస్తుతం రాజకీయాల్లో సీరియస్ కేరెక్టర్ చేస్తున్నారు. వైసిపి ప్రభ్బుత్వానికి మద్దతుగా, జగన్ కి సన్నిహితుడిగా మారిన అలీ.. జనసేన నేత పవన్ కళ్యాణ్ ని విమర్శలు చేస్తూ ఈమధ్యనే జగన్ ప్రభుత్వం నుండి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవిని పట్టేశారు. అయితే ఈ బాధ్యతలు స్వీకరించారో.. లేదో.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ అలీ ఆన్ డ్యూటీ అంటూ జగన్ కి తెలియజేసారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలోని పేదల ఇళ్ళు జగన్ ప్రభుత్వం కూల్చెయ్యడంపై ధ్వజమెత్తారు. రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తోందని, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాల కోసం ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టి ఇళ్లను కూలుస్తోందని.. ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను అలీ కి నచ్చలేదట.
పవన్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. జగన్ ప్రభుత్వానికి ప్రజలు 151 సీట్లని అప్పనంగా కట్టబెట్టలేదు. జగన్ ని నమ్మారు, ఆయన చేతిలో రాష్ట్రం బావుంటుంది అనుకున్నారు.. కాబట్టే గెలిపించారు. రాజధాని విశాఖ అయినా, రాయలసీమ అయినా అభివృద్ధి అన్ని చోట్లా జరుగుతుంది. ఈ మధ్యన విశాఖకు షూటింగ్‌కు వెళ్లాం.. అక్కడ బీచ్‌లు కానీ, రోడ్లు కానీ అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి డవలెప్‌మెంట్ లేని రోజుల్లో కూడా షూటింగ్‌లు జరిగాయి. ఇప్పుడు డవలెప్ చేస్తే తెలుగు సినిమాలే కాదు.. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఫిలింస్ మన దగ్గరికి వస్తాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధిని తప్పుబడుతూ మీరు చేసేది తప్పు అని వాదిస్తే దానిలో అర్థమే లేదని అలీ అన్నారు. మరి అలా పదవి స్వీకరించారో లేదో.. ఇలా డ్యూటీ ఎక్కేసారు మన అలీ గారు అంటున్నారు ఆయన అభిమానులు.