సమంత యశోద మూవీతో ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యశోద మూవీ హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. దాని కోసం ఓ పెద్ద హాస్పిటల్ సెట్ వేసి సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ దానిలోనే చిత్రీకరించారు. విచిత్రంగా సమంత ప్రస్తుతం హెల్త్ ప్రోబ్లెంస్ పేస్ చేస్తూ ఎక్కువగా ఆసుపత్రికి వెళ్లడం అలాగే ఆమె చేసిన సినిమా కూడా ఆసుపత్రి నేపథ్యంలోనే ఉండడం అనేది కో ఇన్సడెన్స్ గా జరిగిపోయింది. అయితే హెల్త్ ప్రోబ్లెంస్ ఎలా ఉన్నా యశోద ప్రమోషన్స్ లో పాల్గొంటున్నట్లుగా సమంత ట్వీట్ చేసిన దగ్గర నుండి అందరిలో ఒకటే ఆశ్చర్యం.
ఆమె ఆరోగ్యం ఎంతగా సహకరించిందో.. లేదో తెలియదు కానీ తనలోని ప్రొఫెషనలిజం మరోసారి చూపిస్తూ యశోదకి ప్రమోషన్స్ కోసం వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం తన శారీరక కష్టాన్ని తట్టుకుంటూ కదిలింది సమంత. ప్రముఖ యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూ లో.. యశోద సినిమా కోసం తాను చేసిన, చేస్తున్న ప్రయాణాన్ని తెలిపింది. అలాగే ప్రస్తుతం తనకి జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి వివరించింది. ఈ ప్రాసెస్ లో సమంత మాట్లాడిన విధానం, తన తీరు ఆమె అభిమానులకే కాదు, అందరిని కంటతడి పెట్టించేలా అనిపించింది. ఆ భావోద్వేగాల లోతు తెలియాలంటే ఆ ఇంటర్వ్యూని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే.
ఇంత కమిట్మెంట్ తో, ఇంత డెడికేషన్ తో తాను చేసిన యశోద సమంతకి మంచి రిజల్ట్ ఇవ్వాలని, వీలైనంత త్వరలోనే తాను మళ్ళీ బ్యాక్ విత్ బ్యాంగ్ అనే రేంజ్ లో రావాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ సమంత.. గెట్ వెల్ సూన్.