పేరుకే ఆయన క్రియేటివ్ దర్శకుడు అన్నట్లుగా ఈ మధ్య డైరెక్టర్ తేజ పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు కొత్త టాలెంట్‌ని బయటికి తీస్తూ.. ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ.. ప్రస్తుతం ఆ గొప్పను చెప్పుకోవడానికే కాలాన్ని వెచ్చిస్తున్నాడు. పుష్కరానికో సినిమా తీస్తూ.. నేనూ ఉన్నానంటే ఉన్నానని అనిపించుకుంటున్న తేజ.. దానికి కూడా ఉదయ్ కిరణ్ మృతిని అడ్డుపెట్టుకోవడం నిజంగా విచారించాల్సిన విషయమే. ఒకప్పుడు సుకుమార్, క్రిష్ వంటి క్రియేటివ్ జీనియస్ అనే పేరు సంపాదించుకున్న తేజకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఖచ్చితంగా ఇది ఆయన స్వయంకృతాపరాధమే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన సినిమా చేయడం కంటే కూడా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి టైమ్ ఎక్కువగా కేటాయిస్తున్నారా? అని అనిపిస్తుంది.
ప్రస్తుతం తేజ ఓ సినిమా చేశాడు. ఆ సినిమా పేరు ‘అహింస’. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం.. హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్‌ని తేజ వాడుకోవాలని చూస్తున్నాడో?.. లేదంటే తన దగ్గర ఉదయ్ కిరణ్‌కి సంబంధించి ఏదో మ్యాటర్ ఉందని.. యూట్యూబ్ ఛానల్స్‌ని ఆకర్షించాలని చూస్తున్నాడో? తెలియదు కానీ.. హీరో ఉదయ్ కిరణ్ టాపిక్ లేకుండా తేజ మనుగడ సాధించలేకపోతున్నాడనేది తాజాగా ఆయనపై ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్త. యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య డబ్బులిచ్చి మరీ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయనే విషయం తెలియంది కాదు. ఈజీగా మనీ వస్తుంటే.. సెట్స్, డైరెక్షన్, ఆర్టిస్ట్‌లు అంటూ సినిమాలు చేయడం పెద్ద తలనొప్పిగా తేజ భావిస్తున్నట్లు ఉన్నాడు. నాలుగు యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తే నెల గడిచిపోతుందనే భావనలో ఆయన ఉన్నట్లు అనిపిస్తుంది. లేదంటే.. అంత క్రియేటివిటీ ఉన్న దర్శకుడు.. అస్తమానం ఉదయ్ కిరణ్ టాపిక్‌తో ఎందుకు హైలెట్ అవ్వాలని చూస్తాడు?
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఉదయ్ కిరణ్ సూసైడ్ గురించి తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడనే కాదు.. ఎప్పుడూ ఈ విషయంపై ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. కాకపోతే.. ఈసారి కాస్త డోస్ పెంచాడు. ‘‘ఉదయ్ కిరణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో నాకు తెలుసు. ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందు నాకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాలు చెప్పడానికి నాకిప్పుడు ధైర్యం లేదు. కానీ నేను చనిపోయే లోపు మాత్రం ఖచ్చితంగా ఆ విషయం బయటపెడతాను’’ అంటూ తేజ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అది మ్యాటర్.. తేజ వంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటని అనిపిస్తుంది కదా..!