ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మొదటి పార్ట్ ‘ది రైజ్’.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందడంతో.. రెండో పార్ట్ ‘ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ పార్ట్ 2.. మొదటి పార్ట్‌కి వచ్చిన అనూహ్య స్పందనతో.. స్ర్కిప్ట్ విషయంలో ది బెస్ట్ కోసం సుకుమార్ చెక్కుతూనే ఉండటంతో ఆలస్యం అవుతూ వచ్చింది. రీసెంట్‌గానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. అలా షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో.. అప్పుడే క్రేజ్ కా బాప్ అనేలా.. ఈ సినిమాపై ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘పుష్ప’ విడుదలై చాలా కాలం అయింది. ‘పార్ట్ 2’ షూట్ లేటయింది. దీంతో తన ఫ్యాన్స్‌కి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని భావించిన అల్లు అర్జున్.. అందుకు తన తమ్ముడి సినిమా వేదికను వినియోగించుకున్నాడు.
తాజాగా అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకకు అతిథిగా హాజరైన అల్లు అర్జున్.. తన సినిమా ‘పుష్ప’ ది రూల్‌కి సంబంధించి పెద్ద అప్‌డేటే ఇచ్చాడు. ఇలాంటి అప్‌డేట్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. బన్నీ మాట్లాడుతూ.. ‘‘బన్నీ వాసు ఈ సినిమా గురించి ఏదేదో మాట్లాడేశాడు.. నాకు తెలుసు మీరంతా ‘పుష్ప 2’ అప్‌డేట్ గురించి అడుగుతున్నారని. నేను కూడా చిన్న అప్‌డేట్ ఇస్తా. ‘పుష్ప1’.. ‘తగ్గేదేలే’ అయితే.. ‘పుష్ప 2’ ‘అస్సలు త గ్గే దే లే’.. ఖచ్చితంగా అంతా పాజిటివ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ ఇచ్చిన ‘పుష్ప 2’ అప్‌డేట్ ఇదే. దీనికి కొందరు నెటిజన్లు.. త్రివిక్రమ్ డైలాగ్‌లా.. ‘చాలా పెద్ద అప్‌డేటే’ అని కొందరు.. పోసాని డైలాగ్‌లా ‘నరాలు కట్ అయ్యాయి రాజా’ అంటూ మరికొందరు.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.