స్వీటీ టాలీవుడ్ లోకి అనుష్క శెట్టి గా ఎంటర్ అయ్యి బాహుబలితో పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. బాహుబలి తర్వాత భాగమతి అంటూ లేడీ ఒరింటెడ్ మూవీతో సత్తా చాటింది. కానీ నిశ్శబ్దం తో మాయమైపోయింది. తర్వాత అనుష్క అంతగా పబ్లిక్ లో పెద్దగా ఫోకస్ అవ్వలేదు. ఆమె బరువు ఆమెని మనుషుల్లో కలననివ్వలేదు. ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణ రాజు AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అనుష్క అక్కడికి సీక్రెట్ గా వెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ రోజు అనుష్క బర్త్ డే. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె నటిస్తున్న సినిమా నుండి లుక్ రివీల్ చేసి విషెస్ తెలిపారు. నిశ్శబ్దం తర్వాత నిశ్శబ్దంగా నవీన్ పోలిశెట్టి తో మూవీ మొదలు పెట్టేసి షూటింగ్ చేసేస్తుంది. ఆ సినిమాలో అన్విత రవళి శెట్టి కేరెక్టర్ లో అనుష్క కనిపించబోతున్నట్టుగా ఆమె బర్త్ డే స్పెషల్ గా వదిలిన లుక్ ద్వారా రివీల్ చేసారు. చెఫ్ అన్విత రవళి శెట్టి కిచెన్‌లో డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా ఆ లుక్ లో తెలుస్తోంది. అలా అనుష్క లుక్ చూసిన ఆమె ఫాన్స్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి స్వీటీ దర్శనం అంటూ సంబర పడిపోతున్నారు.