అఖిల్ ఏజెంట్ మూవీకి అన్నీ అడ్డంకులే అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే ఏజెంట్ విషయంలో మొదటి నుండో ఏదో ఓక్ నెగెటివ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. అందులోను పాన్ ఇండియాలో విడుదల చేస్తున్న ఈ మూవీకి ఇప్పుడు ఉన్న బజ్ ఏ మాత్రం సరిపోదు. నిన్నగాక మొన్న దివాళి రోజున ఏజెంట్ సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించేసారు మేకర్స్. కానీ ప్రమోషన్స్ విషయంలో సైలెంట్ అయ్యారు. అటు సంక్రాంతికి కచ్చిఫ్ వేసిన పెద్ద సినిమాలు చిరు వాల్తేర్ వీరయ్య, బాలయ్య వీర సింహ రెడ్డిలు జోరు చూపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ రెండు చిత్రాల ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఏజెంట్ సైలెన్స్ చూస్తే మళ్ళీ డేట్ మార్చే యోచనలో మేకర్స్ ఉన్నారేమో అనిపించకమానదు. మరి ఏజెంట్ మేకర్స్ మేలుకుని ప్రమోషన్స్ కోసం ఏదైనా కొత్తగా మొదలు పెడితే సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది. అలాగే షూటింగ్ అప్ డేట్ ఇచ్చినా ఓకె. లేదంటే సంక్రాంతికి బిగ్ ఫైట్ లో ఏజెంట్ నిలబడడం కూడా కష్టమైపోతుంది. సైలెన్స్ ని బ్రేక్ చేసి అఖిల్ ఇంకా మేకర్స్ ఏజెంట్ విషయంలో ఏం జరుగుతుందో చెబితే ఓ క్లారిటీ వస్తుంది.. లేదంటే ఇలాంటి అనుమానాలే పుడతాయి.