సమంతకి ఈ మధ్యన ఏ హీరోయిన్ కి లేని పాపులారిటీ ఆమెకి వచ్చింది. కారణం ఆమె మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నా అంటూ చేసిన ట్వీటే. సమంత తనకి హెల్త్ బాలేదు, మాయోసైటిస్ తో ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ లో ఉన్నాను అంటూ చేసిన ట్వీట్ కి ఇండస్ట్రీ ప్రముఖులు, ఆమె స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు అందరూ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ చాలా కోరుకుంటున్నారు. అయితే సమంత తన డిసీస్ తో పోరాడుతూ యశోద ప్రమోషన్స్ లో పాల్గొనకపోవచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి. అభిమానులే కాదు, ఆఖరికి యశోద మేకర్స్ కూడా అదే అనుకుని ఉంటారు. తాను సమస్యలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని.. సో తామే యశోద ని ప్రమోట్ చేసుకోవాలని.
కానీ సమంత తన రీసెంట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ యశోద ప్రమోషన్స్ కోసం రాబోతున్నట్టుగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. నా స్నేహితులు రాజ్ అండ్ DK చెప్పినట్టుగా మన రోజులు ఎంత చెత్తగా ఉన్నా సరే.. మనం ముందుకు సాగాలి, ఈ నెల 11 న మీ ముందుకు యశోద ప్రమోషన్స్ కోసం రాబోతున్నా అంటూ ఆమె చేసిన ట్వీట్ చూసిన వారు సామ్ నువ్ గ్రేట్.. ఇంత బాధలోనూ నువ్ ఇలా నిర్మాతల కోసం ఆలోచిస్తూ సినిమా ప్రమోషన్స్ కోసం రావడం నిజంగా గ్రేట్ అంటూ ఆమెకి సలాం కొడుతున్నారు. ఇక ఆ పిక్స్ లో సమంత బ్లాక్ డ్రెస్ లో ట్రెండీగా ఉన్నప్పటికీ.. కాస్త డల్ గానే కనిపించింది.