ఆదిపురుష్ అఫీషియల్ గా వాయిదా పడింది. జనవరి 12 న ఖచ్చితంగా ఆదిపురుష్ రిలీజ్ అంటూ మేకర్స్ మొన్నటివరకు గట్టిగా చెప్పినా.. గత వారం రోజులుగా ఆదిపురుష్ వాయిదా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా కామ్ గా ఉన్న మేకర్స్ నేడు జనవరి 12 నుండి ఆదిపురుష్ ని తప్పిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆదిపురుష్ ని జూన్ 16, 2013 న రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త డేట్ కూడా ఇచ్చేసరికి ప్రభాస్ ఫాన్స్ రిలాక్స్ అవుతున్నారు. ప్రభాస్ సలార్ కూడా సెప్టెంబర్ లో రాబోతుంది. అప్పుడు ఆదిపురుష్, సలార్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియా లో రచ్చ రచ్చే.
అసలే ఆదిపురుష్ యానిమేటెడ్ మూవీ లాగే కనబడుతుంది. అది ప్రభాస్ ఫాన్స్ కి అలాగే ఆడియన్స్ కి చాలామందికి ఎక్కలేదు. దానితో ఆ సినిమాపై నెగిటివిటి మొదలయ్యింది. దానితో ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. అటు ఆదిపురుష్ ప్రమోషన్స్, ఇటు సలార్ యాక్షన్ మూవీ ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్న టైం లో.. ఆదిపురుష్ పై వచ్చే నెగిటివిటీని తిప్పికొట్టొచ్చు. అందుకే ముందు ఆదిపురుష్ కన్నా సలార్ రావాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు మూడు నెలల గ్యాప్ లో ప్రభాస్ ఫాన్స్ కి మేకర్స్ కిక్ ఇస్తున్నారు. జూన్ లో ఆదిపురుష్ సెప్టెంబర్ లో సలార్ తో ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ.