జబర్దస్త్ నుండి చాలామంది కమెడియన్స్ బయటికి వెళ్లిపోతున్నారు. నాగబాబు తో పాటుగా అప్పట్లో చమ్మక్ చంద్ర, ఆర్పీ, వేణు లాంటి వాళ్ళు కేవలం ఆయన కోసమే బయటికి వెళ్లారు. వాళ్ళు ఓ ఏడాది పాటు బాగా బిజీగా కనబడినా ప్రస్తుతం ఛానల్స్ లో అక్కడక్కడా అడపా దడపా మత్రమే కనబడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ఫైనాన్స్ ప్రోబ్లెంస్ వలనే జబర్దస్త్ ని వదిలినట్టుగా కొన్ని ఇంటర్వూస్ లో చెప్పడం హైలెట్ అయ్యింది. జబర్దస్త్ లో బాగా ఫెమ్ వచ్చాక కొత్త ఇల్లు, కొత్త కార్లు, స్థలాలు అంటూ కొనుక్కుని వాటి కోసం మల్లెమాలని కాస్త ఎక్కువ ఎమౌంట్ ఇవ్వమంటే.. మల్లెమాల ఇవ్వని కారణంగానే ఇతర ఛానల్స్ లో పారితోషకాలు ఎక్కువ అంటూ బయటికి వచ్చేసి మళ్ళీ జబర్దస్త్ కి వెళ్లేందుకు తంటాలు పడుతున్నారు.
ముక్కు అవినాష్, చంటి, నిన్నటికి నిన్న సుధీర్ కూడా జబర్దస్త్ కి ఆరు నెలల గ్యాప్ ఇచ్చింది కేవలం తనకున్న ఫైనాన్స్ ప్రోబ్లెంస్ ని తీర్చుకోవడానికే, మల్లెమాల వాళ్ళని అడిగాను, పనిజరగలేదు అంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ చెయ్యని కారణంగానే చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ని వీడుతున్నారని తెలుస్తుంది. మరి మల్లెమాల ఈ విషయంలో కాస్త ఆలోచిస్తే టాప్ కమెడియన్స్ ని అక్కడే కట్టి పడెయ్యొచ్చు. లేదంటే జబర్దస్థ్ పనైపోయినట్లే.