ప్రభాస్ ఆదిపురుష్ జనవరి 12 నుండి వాయిదా పడిపోయింది. ఆదిపురుష్ టీజర్ తో కాస్త డిస్పాయింట్ అయిన ఫాన్స్ ఆదిపురుష్ రిలీజ్ డేట్ వాయిదా పడినా పెద్దగా ఫీలవలేదు. అయితే ఆదిపురుష్ టీజర్ విషయంలో వచ్చిన నెగెటివిటీకి భయపడిన మేకర్స్.. సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టాలంటూ సినిమాని వాయిదా వేశారు. టెక్నీకల్ గా వండర్ విజువల్స్ ఇవ్వాలని అందుకే సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఆదిపురుష్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో నిన్నటివరకు సస్పెన్స్ లో పెట్టారు.
తాజాగా ఆదిపురుష్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో ఆదిపురుష్ ని రిలీజ్ చేస్తున్న యువి క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ఆదిపురుష్ వచ్చే ఏడాది జూన్ 16 న సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు. ప్రభాస్ రాముడిగా, జానకిగా కృతి సనన్ కనిపిస్తుండగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. ఆదిపురుష్ విజువల్ వండర్ గా ఉండబోతుంది.