Advertisementt

బిగ్ బాస్ 6: స్టేజ్ పై గీతూ ఏడుపే ఏడుపు

Sun 06th Nov 2022 10:49 PM
geetu,bigg boss 6,nagarjuna  బిగ్ బాస్ 6: స్టేజ్ పై గీతూ ఏడుపే ఏడుపు
Bigg Boss 6: Geetu crying on stage బిగ్ బాస్ 6: స్టేజ్ పై గీతూ ఏడుపే ఏడుపు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నుండి తొమ్మిదో వారం గలాటా గీతూ ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అవడం అనేది ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా గీతుని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి హౌస్ బయటికి పంపెయ్యడం గీతూ తట్టుకోలేకపోయింది. శ్రీ సత్య-గీతూ ని డేంజర్ ప్లేస్ లో నించోబెట్టిన బిగ్ బాస్ నాగ్ చేతుల మీదుగా గీతుని ఎలిమినేట్ చెయ్యమనగానే గీతూ ఏడుపు మొదలు పెట్టేసింది. ఫైమా, రేవంత్ లు వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆది రెడ్డి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాడు. ఇక గీతూ అయితే నాగార్జున పక్కనే ఉండి స్టేజ్ పై వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.

నాకు వెళ్లాలని లేదు, మిమ్మల్ని మిస్ అవుతాను. మిమ్మల్ని హార్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి.. అంటూ మిగతా హౌస్ మేట్స్ ని వేడుకుంటూ ఎమోషనల్ అయ్యింది. నేను పోను నన్ను హౌస్ లోకి పంపెయ్యండి అంటూ గీతూ నానా రచ్చ చేసింది. నేను బిగ్ బాస్ హౌస్ ని రూల్ చేద్దామనుకున్నా అనగానే.. నాగార్జున అవును నువ్ అసలు బిగ్ బాస్ కి వస్తావనుకున్నావా అని అడిగాడు. టాప్ 5 లో శ్రీహన్, ఫైమా, రేవంత్, ఆది రెడ్డి, శ్రీ సత్య ఉంటారని చెప్పిన గీతూ హౌస్ లో అందరూ మంచివాళ్ళే.. నాకు బాగోకపోతే అందరూ నన్ను చూసుకున్నారు. కానీ బయట ఎవరి మీద నమ్మకం లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చాక అందరిమీద నమ్మకం కలిగింది అందరూ మంచోళ్ళు అంటూ ఏడుస్తూనే ఉంది. ఇక చివరిగా రేవంత్ పాట పాడుతుంటే.. నేను ఇంటికి వెళ్ళను, నన్ను పంపించకండి బిగ్ బాస్ అంటూ కూలబడి మరీ ఏడ్చిన గీతూ ని నాగార్జున కూడా ఓదార్చలేకపోయారు. అయ్యో పాపం గీతూ అంటూ ప్రేక్షకులు కూడా నిట్టూరుస్తున్నారు.

Bigg Boss 6: Geetu crying on stage:

Geetu gets over emotional in Bigg Boss elimination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ