బాలీవుడ్ వెండితెర మీద వెలగాల్సిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో గ్లామర్ గా ఎక్స్పోజ్ అవుతుంది. హద్దులు మీరిన గ్లామర్ షో తో అందాలు ఆరబోస్తూ హైలెట్ అవుతున్న జాన్వీ కపూర్.. ప్రస్తుతం మిలి ని థియేటర్స్ లో దింపింది. మలయాళంలో హిట్ అయిన హెలెన్ మూవీని హిందీలో మిలి గా రీమేక్ చేసింది. టైటిల్ రోల్ పోషించిన జాన్వీ కపూర్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విరివిగా గ్లామర్ చూపించేసింది. క్లివేజ్ షోస్, సారీ లుక్ అంటూ హొయలు పోయింది.
అయితే జాన్వీ కపూర్ ఈమధ్యన ఓర్హాన్ తో డేటింగ్ లో ఉంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే జాన్వీ కపూర్ ఎక్కువగా ఓర్హాన్ తో కలిసి వెకేషన్స్ కి వెళుతూ, సరదాగా పార్టీలకి తిరుగుతూ ఉంటుంది.
తాజాగా జాన్వీ కపూర్ తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. ఓర్హాన్ చాలా కాలంగా తెలుసు. ఓర్హాన్ నా వెంట ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. ఓర్హాన్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తాడు. నేను ఓర్హాన్ ని చాలా నమ్ముతాను. ఓర్హాన్ చాలా గొప్ప వ్యక్తి అంటూ అతనితో కేవలం స్నేహమే కానీ, మరేమి లేదు అంటూ చెప్పుకొచ్చింది.