అలియా భట్ ఈ రోజు ప్రసవం కోసం ఉదయం 7.30 గంటలకి ముంబైలోని ప్రముఖ రిలయన్స్ ఆసుపత్రిలో చేరింది. ఆమె వెంట భర్త రణబీర్ కపూర్, అత్తగారు నీతూ ఇంకొంతమంది సన్నహితులు ఉండగా.. అలియా భట్ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. అలై తల్లయ్యింది అనే అనే న్యూస్ చూసిన రణబీర్-అలియా భట్ ల అభిమానులు ఆనందంతో మైమరిచిపోతున్నారు. అలియా భట్-రణబీర్ కపూర్ ల జంటకి అమ్మాయి జన్మించిన విషయం అధికారికంగా బయటికి వచ్చింది.
ఈ ఏడాది అలియా భట్ రణబీర్ ని పెళ్లాడడం, అలాగే చాలా త్వరగా ప్రెగ్నెన్సీ ని కన్ ఫర్మ్ చెయ్యడం.. ఏడు నెలలు తిరక్కుండానే తల్లి తండ్రులవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఈ రోజు నవంబర్ 6 ఆదివారం ఉదయం ఆలియా భట్ ఆడపిల్లకి జన్నివ్వడం అటు రణబీర్ ఇటు అలియా భట్ కుటుంబాల్లోనే కాదు, వాళ్ళ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అలియాకి రణబీర్ కి సెలబ్రిటీస్ సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.