కే.జి.ఫ్ పార్ట్ వన్ అండ్ టు తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా మారిన యశ్ కే.జి.ఫ్ తర్వాత చెయ్యబోయే సినిమాపై ఫాన్స్ లోనే కాదు, ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో ఆత్రుత కనిపిస్తుంది. కానీ యశ్ తదుపరి మూవీ విషయంలో చాలా సైలెంట్ గా ఉన్నాడు. అయితే కే.జి.ఫ్ పార్ట్ 2 కి సీక్వెల్ గా పార్ట్ 3 కూడా రాబోతుంది అని కే.జి.ఫ్ 2 క్లైమాక్స్ లో హింట్ ఇవ్వడమే కాదు, కే.జి.ఫ్ మేకర్స్ కూడా KGF3 ఉంటుంది.. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలైపోతోంది అని చెప్పారు. దానితో కే.జి.ఫ్3 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యలో ఆ సినిమాపై రకరకాల గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా యశ్ కి కే.జి.ఫ్ 3 పై ఓ ప్రశ్న ఎదురైంది. అందరూ కే.జి.ఫ్3 పై క్యూరియాసిటీతో ఉన్నారు.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని అడగగా.. దానికి యశ్ షాకింగ్ ఆన్సర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. మేము మీ నుండి చాలా వార్తలు వింటున్నాం, ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కే.జి.ఫ్ 3 పై చాలా రకాల వార్తలు హడావిడి చేస్తున్నాయి, ఒకవేళ కే.జి.ఫ్ 3 ఉంటే నేనే అధికారికంగా ప్రకటిస్తాను, అప్పుడే ఆ విషయాన్ని మా మేకర్స్ చెబుతారు. ఏదైనా అధికారికంగా తెలిసే వరకు ఏ రూమర్స్ నమ్మకండి, ఏదైనా బయటికి వచ్చేవరకు ఓపిక పట్టండి అంటూ యశ్ చెప్పడంతో ఆయన ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు.
ఎందుకంటే యశ్ తదుపరి మూవీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు, అంతేకాకుండా యశ్ ఇంకా ఇంకా కే.జి.ఫ్ లుక్ లోనే ఉండడంతో.. కే.జి.ఫ్ 3 త్వరలోనే మొదలైపోతోంది అనే ఊహాగానాల్లో ఉన్నారు కాబట్టి.. ఇప్పుడు యశ్ చెప్పిన విషయానికి కాస్త డిస్పాయింట్ మూడ్ లోకి వెళుతున్నారు వాళ్ళు.