ముంబై క్యూట్ అండ్ హాట్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం ముంబైలోని పెద్ద ఆసుపత్రి అయిన రిలయన్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. అలియా భట్ ఆసుపత్రిలో చేరింది అనగానే కంగారు పడిపోతున్నారు ఆమె ఫాన్స్. అయితే అలియా భట్ ఆసుపత్రిలో చేరింది డెలివరీ కోసం. ఈ ఏడాది ఏప్రిల్ 14 న వివాహ బంధంతో ఒక్కటైన రణబీర్ కపూర్-అలియా భట్ లు రెండు నెలలు తిరక్కుండానే తాము తల్లితండ్రులం కాబోతున్నామంటూ అలియా భట్ ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలియా భట్ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా పలు సినిమాల షూటింగ్స్ లో, అలాగే ప్రమోషన్స్ లో చాలా యాక్టీవ్ గా పాల్గొంది.
గత రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న అలియా భట్ సీమంతం వేడుకలు గత నెలలో అత్తారింటి తరుపు వారు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ నెల 28 న అలియా భట్ ప్రసవం జరగబోతుంది అనుకున్నారు. కానీ నేడు అలియాభట్ ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ రిలయన్స్ ఆసుపత్రిలో చేరింది. మరికొద్ది గంటల్లోనే అలియా భట్ ప్రసారం జరగనుంది అని, పండంటి బిడ్డకి జన్మనివ్వడానికే అలియా భట్ తన భర్త రణబీర్, అత్త నీతూ తో కలిసి హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలుసుకున్న ఫాన్స్ కూడా కూల్ అవుతున్నారు.
#RanbirKapoor arriving at Reliance foundation hospital with #AliaBhatt. pic.twitter.com/JVBFqiRyeh
— Team Ranbir Kapoor (@RanbirKTeam) November 6, 2022