ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న విశ్వక్ సేన్ కి చాలా ఎక్కువ యాటిట్యూడ్ ఉంటుంది. మొదటి సినిమా నుండే విజయ్ దేవరకొండ అంత పెద్ద స్టార్ లా ఫీలైపోయాడు. విజయ్ దేవరకొండ ఫాన్స్ తో తిట్లు తిన్నాడు.. అలా ఫెమస్ అయ్యాడు. ఇక అశోక వనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్ అప్పుడు టీవీ 9 యాంకర్ తో గొడవ పెట్టుకుని మీడియాలో హైలెట్ అయ్యాడు. ఓరి దేవుడా సినిమాని రిలీజ్ చేసి హిట్ కొట్టగానే.. తదుపరి సినిమా విషయంలో గొడవ. హీరో, నిర్మాత, దర్శకుడిగా అంతో ఇంతో అనుభవం తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తాను వేరే దర్శకకానిర్మాతల దగ్గర పని చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కానీ కథలో వేళ్ళు పెట్టి, డైరెక్షన్ లో కాళ్ళు పెడితే.. నిన్నటి వ్యవహారంలా ఉంటుంది. హీరో అర్జున్ దర్శకనిర్మాతగా విశ్వక్ హీరోగా మొదలైన ఆ సినిమా విశ్వక్ సేన్ యాటిట్యూడ్ తో ఆగిపోయింది. రెండు మూడు సినిమాలకే ఇంత పొగరు చూపిస్తే రేపు కెరీర్ లో ఎదగడం ఎంత కష్టం. తనే ఒప్పుకున్నాడు. కథలో చిన్న చిన్న మార్పులు చెప్పా అని. అన్నీ ఉండి, బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలే సైలెంట్ గా దర్శకులు చెబుతున్న మాట వింటూ సినిమాలు చేసి స్టార్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తుంటే... విశ్వక్ సేన్ మాత్రం రెండు మూడు నామమాత్రపు సక్సెస్ లకే గీర చూపించడం అయన ఫాన్స్ కే నచ్చడం లేదు.
ఏదైనా ఒదిగి ఉంటేనే సక్సెస్ వస్తుంది. కెరీర్ బావుంటుంది. ఇది అర్ధమైతే విశ్వక్ కెరీర్ లో దూసుకుపోతాడు, లేదంటే వివాదాలతో మిగిలిపోతాడు.