సూర్య వెళ్లిపోకముందు కూడా ఇనాయ బిగ్ బాస్ హౌస్ లో అరుస్తూ, ఆడుతూ హైలెట్ అయ్యింది. సూర్య తో రెండు వారాల పాటు చేసిన ఫ్రెండ్ షిప్ ఆమెకి తంటా తెచ్చిపెట్టింది. ఆమె వలనే సూర్య ఎలిమినేట్ అయ్యాడనే భావనలో హౌస్ మేట్స్ ఉండడం కాదు.. శ్రీహన్, శ్రీసత్యలు ఇనాయని ఆడేసుకుంటున్నారు. దాని నుండి బయటపడేందుకు ఇనాయ చాలా కష్టపడుతుంది. శ్రీహన్-శ్రీసత్యలపై కామెంట్స్ చేస్తుంది. అంతేకాకుండా ఫుడ్ విషయంలో హౌస్ లో ఇనాయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఫుడ్ ఇవ్వడం లేదు అని, రేవంత్ మొత్తం తినేస్తున్నాడంటూ అరుస్తుంది.
ఇక శనివారం నాగార్జున ఎపిసోడ్ లో ఇనాయకి నాగార్జున నుండి గట్టిగా క్లాస్ పడింది. ఫుడ్ విషయమే కాదు, శ్రీహన్-శ్రీసత్యలపై కూడా కామెంట్స్ చేసిన వీడియోస్ చూపించిన నాగ్.. నువ్ మాట్లాడేముందు ఆలోచించు, మాట్లాడేశాక బుకాయించకు, ఫుడ్ చాలడం లేదు అంటూ గొడవ చేస్తున్నావ్.. కానీ ఇంట్లో ఫుడ్ ఎలా వేస్ట్ చేస్తున్నారో తెలుసా అంటూ కొన్ని పాడైపోయిన ఆహారపదార్ధాలను చూపించాడు. నేను శ్రీహన్-శ్రీసత్యలపై కావాలని కామెంట్ చెయ్యలేదు అనగానే నాగార్జున నువ్ కావాలనే మాట్లాడావ్ అంటూ వీడియో చూపిస్తూ.. ఇనాయ ఎందుకు అలా అరుస్తావ్, తగ్గించుకో అంటూ ఇనాయకి గట్టిగా క్లాస్ పీకేసరికి ఆమె మొహం మాడిపోయింది.