Advertisementt

నచ్చేలేదు వదిలేసా: విశ్వక్ సేన్

Sat 05th Nov 2022 08:46 PM
vishwak sen,arjun sarja  నచ్చేలేదు వదిలేసా: విశ్వక్ సేన్
Vishwak Sen counter attack on Arjun Sarja నచ్చేలేదు వదిలేసా: విశ్వక్ సేన్
Advertisement
Ads by CJ

అర్జున్ సార్జా దర్శక-నిర్మాత హోదాలో విశ్వక్ సేన్ హీరోగా తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ మూవీ ఈ మధ్యనే మొదలు పెట్టాడు. ఆ సినిమా గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా జరుపుకుంది. అంతా కూల్ గా ఉంది అనుకుంటున్న టైమ్ లో హీరో విశ్వక్ సేన్ అర్జున్ మూవీ నుండి తప్పుకున్నాడనే న్యూస్ వెబ్ మీడియాకి పొక్కింది. అది కాస్తా వైరల్ అయ్యింది. దానితో అర్జున్ సార్జా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ కి డెడికేషన్ లేదు, నా సినిమా షూటింగ్ కి రాకుండా రెండు షెడ్యూల్స్ మిస్ చేసాడు. ఒకసారి విదేశాలకి వెళ్ళొచ్చా టాన్ అయ్యా కొద్దిగా టైమ్ కావాలన్నాడు. అప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. తర్వాత అంతా రెడీ చేసుకున్నాక షూటింగ్ షెడ్యూల్ చెబితే ఆ రోజు తెల్లవారి ఝామునే షూటింగ్ క్యాన్సిల్ చెయ్యమన్నాడు. మధ్యలో కథ నచ్చింది, రెమ్యునరేషన్ విషయంలో తేడా వస్తే.. ఓ ఏరియా రైట్స్ అడిగాడు ఒప్పుకున్నాము. కానీ తర్వాత మా ఫోన్స్ ఎత్తలేదు అంటూ అర్జున్ విశ్వక్ సేన్ పై ఫైర్ అయ్యాడు.

దానితో విశ్వక్ సేన్ కూడా అర్జున్ సార్జా పై కౌంటర్ ఎటాక్ చేసాడు. తనని తాను డిఫెండ్ చేసుకుంటూ.. కథ విషయంలో అర్జున్ గారికి కొన్ని మార్పులు చెప్పిన మాట నిజమే. అవి చాలా చిన్న చిన్నవే అయినా అర్జున్ ఒప్పుకోలేదు. నాకు హీరోగా సెట్ లో గౌరవం లేదు, అన్ని తానే, అన్ని నేనే అన్నట్టుగా అర్జున్ ఉన్నారు. నా మాటకి విలువలేని చోట, మనసుకి నచ్చని చోట పని చెయ్యలేక ఆ సినిమా నుండి తప్పుకున్నాను అంటూ విశ్వక్ సేన్ చెబుతున్నాడు. మరి ఇందులో ఎవరు ఎవరి వలన సఫర్ అయ్యారో.. కానీ ప్రస్తుతము అర్జున్ ఆ సినిమాని ఆపేసి వేరే హీరోని చూసుకుంటా అంటున్నాడు.

Vishwak Sen counter attack on Arjun Sarja:

 Vishwak Sen walks out of Arjun directorial flick

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ