Advertisementt

శిరీష్ హిట్ కొట్టాడు, అన్న సపోర్ట్ స్టార్ట్ చేసాడు

Sat 05th Nov 2022 04:28 PM
allu arjun,urvasivo rakshasivo success celebrations  శిరీష్ హిట్ కొట్టాడు, అన్న సపోర్ట్ స్టార్ట్ చేసాడు
Urvashivo Rakshashivo success celebrations శిరీష్ హిట్ కొట్టాడు, అన్న సపోర్ట్ స్టార్ట్ చేసాడు
Advertisement
Ads by CJ

అల్లు శిరీష్ సినిమా ఉర్వశివో రాక్షసీవో సినిమా విడుదలవుతుంది అంటే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. తమ్ముడికి ఇంట్లో విషెస్ చెప్పినా ఎవరూ పట్టించుకోరు కానీ.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చెప్పే విషెస్ కోసం చాలామంది ఎదురు చూసినా అల్లు అర్జున్ కి అన్న ఆశీస్సులు దక్కలేదు. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షసివో అంటూ యూత్ఫుల్ హిట్ కొట్టేసాడు. దానితో అన్న సపోర్ట్ కూడా మొదలైపోయింది. నిన్న శుక్రవారం విడుదలైన అల్లు శిరీష్ మూవీకి సక్సెస్ టాక్ రావడమే కాదు, క్రిటిక్స్ కూడా మంచి రివ్యూస్ ఇవ్వడంతో టీమ్ సంతోషంలో మునిగిపోయింది. 

దానితో ఉర్వశివో రాక్షసివో చిత్ర బృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. రేపు సాయంత్రం హైదరాబాద్ JRC లో జరగబోయే ఉర్వశివో రాక్షసివో సక్సెస్ సెలెబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ రాబోతున్నాడు. అంటే అన్నగారు తమ్ముడు శిరీష్ ని సపోర్ట్ చేస్తూ ఈ ప్రమోషన్స్ కి హాజరవుతున్నారు. సో అలా తమ్ముడు శిరీష్ కి అన్న అల్లు అర్జున్ సపోర్ట్ మొదలు పెట్టాడన్నమాట.

Urvashivo Rakshashivo success celebrations:

Allu Arjun chief guest as Urvasivo Rakshasivo Success Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ