టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాలతో పాపులర్ అవడం అటుంచి.. ఎక్కువగా కాంట్రవర్సీలతో పాపులర్ అయ్యాడు. త్వరగా హీరో గా ఫెమస్ అవ్వాలనే తాపత్రయం ఆ హీరో లో ఎక్కువగా కనబడుతుంది. తాజాగా విశ్వక్ సేన్ ఓరి దేవుడా అనే రీమేక్ తో హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ మరో కాంట్రవర్సీకి తెర లేపాడు. అది అతని రీసెంట్ మూవీ నుండి తప్పుకోవడమే. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసారు.
అంతేకాదు అర్జున్ త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసాక విశ్వక్ సేన్ ఈ మూవీ నుండి తప్పుకుని అర్జున్ కి షాక్ ఇచ్చాడట. అగ్రిమెంట్ బ్రేక్ చేసి మరీ విశ్వక్ చెప్పా చెయ్యకుండా మూవీ నుండి బయటికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దానితో అర్జున్ కి విశ్వక్ మీద ఫైర్ అవుతున్నారని, ఫిలిం ఛాంబర్ లో విశ్వక్ సేన్ పై ఫిర్యాదు చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.