Advertisementt

సమ్మర్ కి ప్లాన్ చేస్తున్న ఖుషి

Sat 05th Nov 2022 11:05 AM
kushi movie,vijay deverakonda  సమ్మర్ కి ప్లాన్ చేస్తున్న ఖుషి
Vijay Deverakonda Khushi release date changed సమ్మర్ కి ప్లాన్ చేస్తున్న ఖుషి
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-సమంత కాంబోలో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి మూవీ కి అన్ని శకునాలే కనిపిస్తున్నాయి. ఖుషి షూటింగ్ కాశ్మీర్ లో మొదలు పెట్టి చకచకా చాలావరకు కంప్లీట్ చేసేసారు. లైగర్ ప్రమోషన్స్ కి ముందే విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక లైగర్ విడుదలకు ముందు ప్రమోషన్స్ కోసమని విజయ్ రావడం.. మళ్ళీ ఇంతవరకు ఖుషి తదుపరి షెడ్యూల్ పట్టాలెక్కలేదు. లైగర్ పోయినా ఖుషి షూటింగ్ మూడ్ లోకి విజయ్ వచ్చినా.. సమంత అనారోగ్య కారణాలు అడ్డుపడ్డాయి. దానితో డిసెంబర్ లో ఖుషి విడుదల అన్న మేకర్స్ డేట్ చేంజ్ చేసారు.

మళ్ళీ రెండు నెలల గ్యాప్ లో ఫిబ్రవరిలో ఖుషి రిలీజ్ అన్నారు. కానీ సమంత ఎప్పుడు మళ్ళీ సెట్స్ మీదకి వస్తుందో తెలియక.. మరోసారి ఫిబ్రవరి నుండి ఖుషి రిలీజ్ డేట్ ని మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అంటే సమ్మర్ కి షిఫ్ట్ చేస్తే కూల్ గా పనులవుతాయి. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సర్దుకుని షూటింగ్ కంప్లీట్ చెయ్యొచ్చనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీన్నిబట్టి విజయ్ దేవరకొండ మరికొన్ని రోజులు ఖాళీగా ఉండడడం తప్పేలా లేదు. అందుకే విజయ్ మరో ప్రాజెక్ట్ ఓకె చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడినట్లుగా టాక్.

Vijay Deverakonda Khushi release date changed:

Kushi release date pushed to summer from Feb 13th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ