Advertisementt

బిగ్ బాస్ 6: ఆది రెడ్డి కాళ్ళ దగ్గర గీతూ

Fri 04th Nov 2022 08:48 PM
bigg boss 6,geetu,adi reddy  బిగ్ బాస్ 6: ఆది రెడ్డి కాళ్ళ దగ్గర గీతూ
Bigg Boss 6: Geetu at Adi Reddy feet బిగ్ బాస్ 6: ఆది రెడ్డి కాళ్ళ దగ్గర గీతూ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో ఆది రెడ్డి-గీతు మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఫెమస్ అయ్యారు. హౌస్ లో స్ట్రాటజీలతో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హౌస్ లో ఒకరి గురించి ఒకరు మట్లాడుకుని, తప్పొప్పులు చెప్పుకునేంత చనువు వచ్చేసింది. వారు ఎనిమిది వారాల్లో ఎలాంటి గొడవ పడలేదు. ఆఖరికి నాగార్జున గీతూని తప్పన్నా అది రెడ్డి వెనకేసుకొచ్చాడు. కానీ తొమ్మిదో వారంలో ఆది రెడ్డి కి గీతు కి మధ్యన మాములుగా గొడవ జరగలేదు. ఆది రెడ్డి టి షర్ట్ దాచేసిన గీతూని ఆయన అడిగినా, గొడవ పడినా ఇవ్వలేదు. నీది తుప్పాసి గేమ్ అంటూ అది రెడ్డి స్టేట్మెంట్ పాస్ చేసాడు. అంతేకాకుండా అది రెడ్డికి గీతు పై బాగా కోపం వచ్చి మైక్ విసిరి కొట్టేసాడు. అలాగే గీతు నువ్ హౌస్ లో కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అప్పుడు చెబుతా అంటూ ఛాలెంజ్ చేసాడు.

అయితే గీతు చేసింది కరెక్ట్ కాదు, ఆది రెడ్డి టాస్క్ లో బ్రతికే ఉన్నాడని బిగ్ బాస్ చెప్పడంతో ఆది రెడ్డి హ్యాపీ గా ఫీలయ్యాడు. తర్వాత ఆది రెడ్డి మైక్ విరగ్గొట్టిన కారణంగా అతను కెప్టెన్సీ కంటెండర్ గా ఓడిపోయాడు అని బిగ్ బాస్ చెప్పడంతో ఆది రెడ్డికి కోపం వచ్చింది. టాస్క్ ముగియగానే గీతు ఆది రెడ్డి దగ్గరకి వెళ్లి కాళ్ళ దగ్గర కూర్చుని సారి ఆది రెడ్డి అంది. నీ వల్ల గేమ్ మొత్తం పోయింది. నేను కంటెండర్ గా చచ్చిపోయా, మైక్ విరగ్గొట్టా, నువ్ ఏమడుతున్నావ్ అంటూ బాధపడ్డాడు ఆది రెడ్డి. గీతూ ఆది రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చుని సారి చెప్పిన ప్రోమో వైరల్ అయ్యింది.

Bigg Boss 6: Geetu at Adi Reddy feet:

Bigg Boss 6: Today episode promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ