హీరో సిద్దార్థ్ అదితి రావు తో ప్రేమలో ఉన్నాడనే న్యూస్ ని సిద్దార్థ్ ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ చేసేసాడు. కొన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా మెయింటింగ్ చేసిన తమ బంధాన్ని సిద్దార్థ్ ఈ మధ్యన అదితి రావు బర్త్ డే రోజున రివీల్ చేసాడు. మై స్వీట్ హార్ట్ అంటూ సంబోధించడం అందరూ వారి మధ్యన లవ్ ట్రాక్ ఉంది అని ఫిక్స్ అయ్యేలా చేసింది. తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో బాలయ్య కూడా సిద్దు లవ్ ని కన్ ఫర్మ్ చేసినట్టే కనిపించింది. ఈ వారం ఆహా అన్ స్టాపబుల్ కి మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ శర్వానంద్-అడివి శేష్ వచ్చారు. వారితో బాలయ్య కూడా యంగ్ అండ్ ఎనెర్జిటిక్ గా మారిపోయి అల్లరల్లరి చేసేసారు. ఇక శర్వానంద్ ని సినిమాల కథల విషయం ఎలా ఎంచుకుంటావ్ అని అడిగితే..
కథలు వింటాను.. నచ్చినవి చేస్తాను. దర్శకులు చెప్పింది చేస్తాను అన్నాడు. ఇక హీరోయిన్స్ విషయంలో మీ ఇన్వొల్వెమెంట్ ఉంటుందా అనగానే.. అస్సలుండదు అన్నాడు. దానికి బాలయ్య మహాసముద్రంలో హీరోయిన్ అదితి కూడా అన్నాడు. నాకు పెయిర్ కాదు సిద్దార్థ్ కి పెయిర్ అన్నాడు. కానీ నువ్వే తగులుకున్నావ్ సినిమాలో. బయట సిద్దార్థ్ ఆమెతో తిరుగుతుందా అంటే.. నాకు తెలియదు సర్ అన్నాడు శర్వా. మొన్నేదో ఫోటో పెట్టి, పోస్ట్ పెట్టాడు నా స్వీట్ హార్ట్ అంటూ పెట్టాడు నాకు అర్ధం కాలేదు అంటూ అమాయకంగా చెప్పాడు శర్వా.. కానీ బాలయ్య మాత్రం షో లో అది నిజమే అని చెబుతున్నారు.