బిగ్ బాస్ సీజన్ 6 తొమ్మిదో వారం నామినేషన్స్ లో ఇనాయ, గీతూ, రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా, శ్రీసత్య, ఇంకా మరీనా, రోహిత్ లు ఉన్నారు. ఈ వారం కెప్టెన్ గా శ్రీహన్ సేఫ్ జోన్ లో ఉండగా.. వాసంతి, రాజ్ లని ఎవరూ నామినేట్ చెయ్యలేదు. అయితే నామినేషన్స్ లో ఉన్న రేవంత్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉండేవాడు. కానీ రేవంత్ నోరు అదుపులో లేకపోవడంతో అతనికి ఓటింగ్ శాతం టాప్ లోనే ఉన్నా.. బయట అతనిపై నెగిటివిటీ బాగా కనబడుతుంది. ఇక సూర్య గత వారం ఎలిమినేట్ అవడంతో ఇనాయ సుల్తానాపై ఆ ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే.. ఇనాయ చేసిన డ్రామాతో ఆమెకి ఒక్కసారిగా సింపతీ ఓట్స్ పెరిగిపోయాయి. గత వారం, ఈ వారం గీతూ టాస్క్ ల్లో చేసిన చిల్లరపనులతో ఆమెకి ఆడియన్స్ షాక్ ఇచ్చేలా కనబడుతున్నారు. ఇక మూడో స్థానంలో గీతూ తో గొడవ పెట్టుకుని క్రేజ్ సంపాదించిన బాలాదిత్య ఉన్నాడు, నాలుగో స్థానంలో కీర్తి రెడ్డి, ఐదో స్థానంలో శ్రీ సత్య కొనసాగుతున్నారు.
ఆరో స్థానంలో రోహిత్ ఉండగా.. ఆది రెడ్డి ఏడో స్థానానికి పడిపోయాడు. ఇక గత కొన్ని వారాలుగా టాస్క్ విషయంలో, అలాగే కామెడీ విషయంలో దూసుకుపోయిన ఫైమాకి వెటకారం ఎక్కువైంది అంటూ వేసిన నామినేషన్స్ సెగ ఇక్కడ ఓటింగ్ లో కనబడుతుంది. దానితో ఆమె ఎనిమిదో స్థానానికి దిగజారింది. మరీనా తొమ్మిదో స్థానంలో ఉండగా.. డేంజర్ జోన్ లో గీతూ ఉండడం అందరికి షాకిచ్చింది. అయితే ఓటింగ్ తో సంబంధం లేకుండా వారం వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పుడు అదే భయం నామినేట్ అయిన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అయితే ఎంతగా డేంజర్ జోన్ లో ఉన్నా గీతూ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు అంటున్నారు కొందరు. మరి మరీనా-ఫైమా-గీతూ లలో ఎవరు వెళతారో చూడాలి.