హీరోయిన్ హన్సిక వ్యక్తిగతంగా సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఈ ఏడాది హన్సిక ముంబై కి చెందిన వ్యాపారవేత్తతో జీవితాన్ని పంచుకోబోతుంది. హన్సిక డిసెంబర్ 4 న ముంబైకి చెందిన సోహెల్ కూతురియాతో రాజస్థాన్ ప్యాలస్ లో ఏడడుగులు నడిచేందుకు సిద్దమవగా.. హన్సిక చేసుకోబోయే వరుడి వివరాల కోసం నెటిజెన్స్ సోషల్ మీడియాని జల్లెడ పెట్టేస్తున్నారు. సోహెల్ తో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న హన్సిక అతనితో పెళ్ళికి ఒప్పేసుకుంది. అయితే సోహెల్ - హన్సిక ఇద్దరూ బిజినెస్ పార్టనర్స్ కూడా. హన్సిక తన పెళ్లి విషయాన్ని, తాను పెళ్లాడబోయే వరుడిని రీసెంట్ గానే పరిచయం చేసింది. అయితే హన్సిక చేసుకోబోయే సోహెల్ కి గతంలోనే ఒక అమ్మాయితో పెళ్లయ్యింది అనే విషయం తెలిసిన హన్సిక ఫాన్స్ షాకవుతున్నారు.
సోహెల్ కి 2016 లో రింకీ అనే అమ్మాయితో పెళ్లైందట. అది కూడా హన్సిక బెస్ట్ ఫ్రెండ్ రింకీతో సోహెల్ వివాహం జరగగా.. ఆ పెళ్ళికి అప్పట్లో హన్సిక కూడా హాజరైంది. అయితే సోహెల్ కి రింకీ కి మధ్యన అభిప్రాయభేదాలు రావడంతో.. వారిరువురు విడాకులు తీసుకున్నారట. తర్వాత కొన్నాళ్ళకి హన్సిక-సోహెల్ డేటింగ్ మొదలు పెట్టి.. ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి పీటలెక్కబోతున్నారు. సోహెల్ కి గతంలోనే పెళ్లయ్యింది అనే విషయం.. ఓ వీడియో ద్వారా మీడియా లో చక్కర్లు కొడుతోంది.