నటి పూర్ణ ఈ మధ్యనే దుబాయ్ కి చెందిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న విషయాన్ని రివీల్ చేసింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యన పూర్ణ వివాహం జరిగినట్టుగా పెళ్లి ఫొటోస్ ని షేర్ చేసింది. దుబాయ్ షేక్ అయిన షానిద్ ఆసిఫ్ అలీ తో పూర్ణ ప్రేమలో పడి పెళ్లి పీటలెక్కింది. అయితే పూర్ణ తన పెళ్ళికి ఒంటినిండా బంగారు ఆభరణాల వేసుకుని మెరిసిపోయింది. ముస్లిం పద్దతిలో జరిగిన ఈవేడుకలో పూర్ణ వేసుకున్న నగలన్నీ భర్త షానిద్ ఆసిఫ్ అలీ గిఫ్ట్ గా ఇచ్చినవేనట. ఆ ఆభరణాల ఖరీదు ఇండియన్ రూపీస్ లో 1.20 కోట్లుగా విలువ కట్టారు. భర్త పూర్ణకి 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడంటూ చెప్పుకున్నారు.
అయితే తాజాగా పూర్ణకి కేవలం బంగారమే కాదు ఓ బంగాళా ని భర్త రాసిచ్చినట్లుగా తెలుస్తుంది. అది అలాంటి ఇలాంటి బంగ్లా కాదని, దుబాయ్‌లో ఓ లగ్జరీ హౌస్‌ను ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని.. దీని విలువ దాదాపు 20 కోట్లు వరకూ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కేవలం డబ్బు, బంగారం, ఇల్లు మాత్రమే కాకుండా కంపెనీలోని కొన్ని షేర్లను కూడా పూర్ణ పేరిట రాశాడట. మరి పూర్ణ దెబ్బకి సెటిల్ అయిపోవడం ఖాయమే. కానీ ఆమె ఇంకా బుల్లితెర మీద, అలాగే వెండితెర మీద అవకాశాల కోసం ఇంకా ఇంకా వెయిట్ చేస్తూనే ఉంది. ఇప్పటికి ఢీ డాన్స్ షోకి జేడ్జ్ గా కనబడుతుంది. అలాగే సినిమాలకు కమిట్ అయ్యింది.