అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పుష్ప తో పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. అవార్డులు, రివార్డులు అంటూ కలియదిరిగేస్తున్నాడు. పుష్ప తో ఒక్కసారిగా రేంజ్ మారిపోయింది. అంత క్రేజ్, అంత పలుకుబడిని అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి స్టార్ హీరో ఓ సినిమాపై ఓ చిన్న ట్వీట్ వేస్తె అది ఖచ్చితంగా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఆ పని చెయ్యలేదు. ఇండస్ట్రీలో ఏదో చిన్న హీరో మనకేం పని అనుకోవడానికి లేదు. సొంత తమ్ముడు, కెరీర్ లో ఒడిదుడుకులు పడుతున్న హీరో.. అల్లు శిరీష్ సినిమా కి అన్నగారి సపోర్ట్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అల్లు శిరీష్ నటించిన ఉర్వశివో రాక్షసివో చిత్రం నేడు విడుదలైంది. ఈ సినిమా ఈవెంట్ కి కానీ, విడుదలవుతున్నప్పుడు బెస్ట్ విషెస్ చెబుతూ ఒక్క ట్వీట్ కానీ అల్లు అర్జున్ నుండి రాకపోవడం గమనార్హం.
ఆ మధ్యన అల్లు ఫ్యామిలిలో లుకలుకలు అని, అల్లు శిరీష్ అన్న మీద, తండ్రి మీద బెదిరించి బెంగుళూర్ లో ఉంటున్నాడని ఏవేవో కథనాలు వచ్చినా, తర్వాత అల్లు స్టూడియో ఓపెనింగ్, ఆయన బుక్ లాంచ్ ఈవెంట్స్ లో కలిసిమెలిసి కనబడ్డారు. అయితే ఇప్పుడు మరోసారి అనుమానం వచ్చేలా అల్లు అర్జున్ తమ్ముడి సినిమాని లైట్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కి సపోర్ట్ చేస్తూ సినిమాలని ప్రమోట్ చేస్తాడు. కానీ అల్లు అర్జున్ శిరీష్ ని పట్టించుకోవడం లేదనిపిస్తుంది. అంత పెద్ద స్టార్ అయ్యుండి సినిమాపై ఓ ట్వీట్ వేస్తె ఎంతో కొంత హెల్ప్ అయ్యేది అనేది చాలామంది భావన. అలాగే తనతో నా పేరు సూర్యలో నటించిన అను హీరోయిన్. అలా తమ్ముడు శిరీష్ కి, హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ ని విష్ చేస్తే పోయేది. ఇంత గోల ఉండేది కాదు.