బిగ్ బాస్ సీజన్ 6 లో టాస్క్ లు ఆడడం అటుంచి కంటెస్టెంట్స్ చేసే అతి చూడలేకపోయారు బుల్లితెర ప్రేక్షకులు. మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవుద్ది అనుకున్న ఇనాయ సుల్తానా ఇప్పటివరకు నిలబడింది. అటు టాస్క్ పరంగాను, ఇటు స్ట్రెంత్ పరంగాను స్ట్రాంగ్ గా మారింది. మధ్యలో సూర్య తో ఆమె చేసిన ఫ్రెండ్ షిప్ ఆమె గ్రాఫ్ పడిపోయేలా చేసింది. అయితే సూర్య ఎలిమినేట్ అవడంతో ఆమె మరోసారి పుంజుకుంది. అయితే హౌస్ లో ఎక్కువగా ఆమెని టార్గెట్ చేస్తున్నారు హౌస్ మేట్స్. సూర్య ఆమె వల్లే వెళ్లిపోయాడని అంటూ ఆడుకుంటున్నారు. దానిని తీసుకోవడం ఇబ్బందిగా మారి నోటికి పని చెబుతుంది. ఇక గత రాత్రి సూర్య ప్లేట్ తీసేశారంటూ ఫుడ్ మీద అలిగింది. సూర్య రావాలని కోరుకోమంటూ మరీనాకి చెప్పింది. ఫైమా నువ్వసలు నా ఫ్రెండ్ వే కాదు అంటూ చాలా అతి చేసింది. అనవసరంగా శ్రీహన్-శ్రీసత్యలపై ఫైర్ అవుతూ చాలా ఓవర్ చేసింది.
ఇక టాస్క్ పరంగా ఎప్పుడూ టాప్ లో ఉండే రేవంత్ మొదటి నుండి టైటిల్ ఫెవరెట్ గానే ఉన్నాడు. అలాగే నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి ఓటింగ్ పరంగా టాప్ లో ఉంటున్నాడు. అయితే మనోడికి నోటి దూల చాలా ఎక్కువ. నాగార్జున చెప్పినా వినడం లేదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు. రాత్రి ఎపిసోడ్ లో నీయమ్మ అనే పదం వాడినా వాడలేదంటూ బుకాయింపు. ఇలా రేవంత్ నోరు అదుపులోకి రావడం లేదు. ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతాడు. అదే అతనికి వీక్నెస్ గా మారి గీతూ, ఇనాయ లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది.