ఏపీలోని జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో.. ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్ధంకాని అయోమయంలో ఉన్నారు ఏపీ ప్రజలు. ముసలి వాళ్ళకి పింఛన్లు, ఆడవాళ్ళకి జగనన్న భరోసా.. ఇలా పథకాల పేరుతో అందరిని తనవైపు తిప్పేసుకుని ఓటు బ్యాంకు సృష్టించేసుకుందామని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. ఇటు ఇండస్ట్రీ నుండి కమెడియన్స్ తప్ప జగన్ కి వత్తాసు పలికే హీరోలు లేరు. ఏదో కరోనా పేరుతొ నష్టపోనున్నామని ఇండస్ట్రీ పెద్దలు జగన్ చుట్టూ తిరిగారు కానీ, వాళ్ళ పనైపోయాక మళ్ళీ జగన్ మొహం వంక చూడలేదు. ఆల్రెడీ ఓ కమెడియన్ కి బుద్దొచ్చి వెనక్కి తిరిగి వచ్చేసాడు.
కానీ ఇద్దరు కమెడియన్స్ మాత్రం ఇంకా జగన్ చుట్టూనే ఉన్నారు. జగన్ కోసమే పని చేస్తున్నారు. అందులో అలీ, పోసానీ ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టినందుకు గాను జగన్ ఆ ఇద్దరినీ వెయిట్ చేయించి చేయించి ప్రభుత్వానికి ఇంకా ఓ ఏడాది మాత్రమే టైం ఉన్న సమయంలో వాళ్ళకి నామమాత్రం పదవులు కట్టబెట్టాడు. అలికి స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవి ఇస్తే.. పోసానికి ఏపీ ఫిలిం డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. అయితే ఈ ఇద్దరికి తూతూ మంత్రం పదవులు ఇచ్చేస్తే.. ఇండస్ట్రీకి మంచి చేసేసినట్టు అవుతుంది.. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం మన వెనకే ఉంటుంది అనుకున్నాడేమో జగన్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.