సమంత అనారోగ్య కారణాల దృష్యా బయటకి రావడం లేదు. తనకి మాయోసైటిస్ అనే డిసీస్ వచ్చినట్టుగా ఆమె షేర్ చేసారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఆమె బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే సమంత నటించిన యశోద మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ తరుణంలోనే సమంత తనకి ఆ డిసీస్ వచ్చినట్టుగా బయటపెట్టింది. యశోద మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు నెలల ముందే రిలీజ్ కావాల్సి ఉండగా.. సమంత ఆరోగ్యం దృష్యా సినిమాని పోస్ట్ పోన్ చేసారు. కానీ ఆమె ఇంకా కోలుకోకపోవడంతో నిర్మాతలు సినిమాని నవంబర్ 11 న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
అయితే సమంత ఈ ప్రమోషన్స్ లో పాల్గొనబోదని తెలుస్తుంది. అందుచేతనే మీడియా వారు రకరకాలుగా ఊహించేసుకోకుండా సమంత ముందే తన డిసీస్ ని బయటపెట్టి, తానెందుకు బయటికి రావడం లేదో క్లారిటీ ఇచ్చేసింది. అయితే ప్రస్తుతం యశోద ప్రమోషన్స్ సమంత లేకుండా మొదలైనాయి. సమంత ఉంటే పాన్ ఇండియా ప్రేక్షకులకి సినిమాని దగ్గర చేసేందుకు మేకర్స్ ప్రయత్నం చేసేవారు. కానీ ఆమె ప్రమోషన్స్ కి దూరంగా ఉండడంతో.. వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి ప్రముఖ నటులతో సినిమాని ప్రమోట్ చేయిస్తున్నారు. మరి సమంత రాకుండానే, లేకుండానే సినిమా విడుదలకి దగ్గరైంది.