Advertisementt

లైగర్ పోయినా.. బ్రాండ్ వాల్యూ తగ్గలేదు

Thu 03rd Nov 2022 10:36 PM
vijay devarakonda,liger movie  లైగర్ పోయినా.. బ్రాండ్ వాల్యూ తగ్గలేదు
Even if Liger is gone, the brand value has not decreased లైగర్ పోయినా.. బ్రాండ్ వాల్యూ తగ్గలేదు
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అవుదామనుకుని కలలు కన్న.. లైగర్ మూవీ విజయ్ దేవరకొండకి గుక్కతిప్పుకోలేని షాక్ ఇచ్చింది. ఆ సినిమా డిసాస్టర్ తో విజయ్ పనైపోయింది అనుకుని చాలామంది హీరోలు లోలోపల ఆనందపడిపోయే ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా కొద్ది టైమ్ లోనే స్టార్ రేంజ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. చాలామంది హీరోలు చాలా సినిమాలు చేస్తే కానీ అంతటి పొజిషన్ దక్కలేదు. అందుకే విజయ్ ని చూసి కుళ్లుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత లైగర్ డిసాస్టర్ చూసి కూల్ అయ్యారు. లైగర్ దెబ్బకి విజయ్ దేవరకొండ ఓ ఆరు నెలలు టైం తీసుకుంటాడు. పబ్లిక్ లోకి వచ్చే సాహసం చెయ్యడు.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడనే ప్రచారం జరిగింది.

కానీ లైగర్ పోయినా విజయ్ కుంగిపోలేదు. డిప్రెషన్ లోకి వెళ్ళలేదు. అలాగే ఫాన్స్ ని, పబ్లిక్ ని వదల్లేదు. ఇటు విజయ్ బ్రాండ్ వాల్యూకూడా తగ్గలేదు. విజయ్ దేవరకొండ రీసెంట్ గా గ్లామర్ డాల్ కియారా అద్వానీతో కలిసి సెర అనే యాడ్ చేసాడు. అంతేకాకుండా విజయ్ మరిన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. లైగర్ ఫలితాన్ని పట్టించుకోకుండా విజయ్ కి ఇలా క్రేజీ గా ఆఫర్స్ రావడంచూసిన ఫాన్స్ విజయ్ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు అంటూ హ్యాపీ గా ఫీలవుతున్నారు.

Even if Liger is gone, the brand value has not decreased:

Vijay Devarakonda brand has not decreased

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ