బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే సామాన్యమైన వ్యక్తిగా ఆది రెడ్డి అడుగుపెడితే.. గలాటా గీతు సెలెబ్రిటీ హోదాలో, బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఫెమాస్ అయిన అమ్మాయిగా అడుగుపెట్టింది. గీతు, ఆది రెడ్డి హౌస్ లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యారు. గీతు ఎవరితో ఫ్రెండ్ షిప్ చెయ్యకపోయినా ఆదిరెడ్డితో అన్ని షేర్ చేసుకుని ఫ్రెండ్ షిప్ చేస్తుంది. గత వారం ఆదిరెడ్డి ఎక్కడ ఎలిమినేట్ అవుతాడో అని కన్నీళ్లు పెట్టుకుంది. అంత క్లోజ్ అయిన గీతుకి ఆదిరెడ్డికి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో గొడవవ్వడం ఖాయంగా కనబడుతుంది.
నాగార్జున ఆదిరెడ్డిని లేపి నీ పార్ట్నర్ గేమ్ ఎలా ఉంది అన్నప్పటికీ.. గీతు ఆట వరెస్ట్ గా ఉన్నా.. ఆది రెడ్డి బావుందనే అన్నాడు. అలాంటి ఆది రెడ్డి ఇప్పుడు గీతు మీద ఫైర్ అవుతున్నాడు.
ఈ వారం టాస్క్ లో బాలాదిత్య లైటర్ దాచేసి అతన్ని బాగా ఏడిపించిన గీతుకి ఆది రెడ్డి మంచి చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో టాస్క్ పోజ్ లో ఉండగా.. గీతు ఆది రెడ్డి గేమ్ టీ షర్ట్ దాచేసింది. ఆది రెడ్డి గీతు ని అడిగితే నేను తియ్యలేదు అంది. గేమ్ ఆగిపోయినప్పుడు ఎవరివి ఎత్తకూడదని చెప్పాక నువ్ ఆలా ఎలా చేస్తావ్ అన్నప్పటికీ గీతు ఇవ్వలేదు. తర్వాత అది రెడ్డి వచ్చి ఫైమా తో ఈ రోజు గీతు గనక నా టి షర్ట్ దాచేసింది అని తేలితే.. ఇకపై ఆది రెడ్డి vs గీతు గేమ్ స్టార్ట్ అవుతుంది అంటూ చేసిన కామెంట్స్ ప్రోమోలో వైరల్ అయ్యాయి.